పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు సాగిస్తాం
ABN , Publish Date - Dec 26 , 2023 | 09:44 PM
నిరుపేద ప్రజల సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ నిరంతరం పోరాటాలే లక్ష్యంగా ముం దుకు సాగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 26: నిరుపేద ప్రజల సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ నిరంతరం పోరాటాలే లక్ష్యంగా ముం దుకు సాగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న కాన్ పూర్‌లో సీపీఐ పార్టీ ఆవిర్భవించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజ లు, కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేస్తున్నామన్నారు. దేశంలో కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా కార్మి కులు, ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. సీపీఐ జిల్లా కార్య దర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు మేకల దాసు, రేగుంట చంద్ర శేఖర్, జోగుల మల్లయ్య, లింగం రవి, పోచన్న, పౌలు, దుర్గరాజ్, రాజేశ్వర్ రావు, శంకరయ్య, మహేందర్‌రెడ్డి, సాంబయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి: మండలంలో సీపీఐ ఆవిర్భావ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. పాత బెల్లంపల్లిలో మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సీపీఐ భూమి, భుక్తి కోసం దేశ ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిం దన్నారు. సీపీఐ నిరంతరం పేద ప్రజల సమస్యల పరిష్కారానికి పోరా టాలు చేస్తుందన్నారు. నాయకులు హన్మంతు, కుమార్, రాజేశం, శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతి, వెంకటేష్, సుదర్శన్ పాల్గొన్నారు.