Share News

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం

ABN , First Publish Date - 2023-12-05T22:42:28+05:30 IST

నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తు న్నామని తాజామాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం అహర్నిషలు కష్టప డిన నాయకులు, కార్యకర్తలకు, బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు, ఆత్మీయు లకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం

ఏసీసీ, డిసెంబరు 5: నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తు న్నామని తాజామాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం అహర్నిషలు కష్టప డిన నాయకులు, కార్యకర్తలకు, బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు, ఆత్మీయు లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎవరు అధైర్యపడవద్దని నాయకులకు భరోసా కల్పించారు. పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రజల కోసం పనిచేస్తూనే ఉం టానన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, మంచిర్యాల, లక్షెట్టిపేట మున్సిపల్‌ చైర్మన్‌లు పెంట రాజయ్య, నల్మాసు కాంతయ్య, సందెల వెంక టేష్‌, పల్లె భూమేష్‌, సుబ్బయ్య , సత్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T22:42:29+05:30 IST