అఖిలపక్షం ఆధ్వర్యంలో వాంకిడి బంద్‌ సంపూర్ణం

ABN , First Publish Date - 2023-01-25T22:03:21+05:30 IST

వాంకిడి, జనవరి 25: మండల కేంద్రంలోని చౌపన్‌గూడ చౌరస్తాలో అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన బంద్‌సంపూర్ణంగా జరి గింది. ఉదయం వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో వాంకిడి బంద్‌ సంపూర్ణం

వాంకిడి, జనవరి 25: మండల కేంద్రంలోని చౌపన్‌గూడ చౌరస్తాలో అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన బంద్‌సంపూర్ణంగా జరి గింది. ఉదయం వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. సర్పంచు బండె తుకారం ఆధ్వర్యంలో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం గ్రామసభను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న అండర్‌పాస్‌ ప్రజలకు ఏమాత్రం అనుకూలం కాదని చౌపన్‌గుడ చౌరస్తాలో నిర్మించా లని తీర్మాణం చేశారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రజల సౌకర్యార్థం అండర్‌పాస్‌ నిర్మించాలని లేనిప క్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. తీర్మాణపత్రాలను కలెక్టర్‌, ఎన్‌హెచ్‌ఏఐ పీడీలకు పంపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరె పెంటు, బౌద్ధమహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్‌మహోల్‌కార్‌ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T22:03:21+05:30 IST