జిల్లాలో వీవోఏల సమ్మె విరమణ

ABN , First Publish Date - 2023-05-31T23:42:33+05:30 IST

ఐకేపీలో పని చేస్తున్న వీవోఏలు సమ్మె విరమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఐకేపీ వీవోఏల సంఘం నాయకులు డీఆర్డీవో పీడీ విజయలక్ష్మికి సమ్మె విరమిస్తున్నట్లు లేఖ అందజేశారు.

జిల్లాలో వీవోఏల సమ్మె విరమణ

నిర్మల్‌ కల్చరల్‌, మే 31 : ఐకేపీలో పని చేస్తున్న వీవోఏలు సమ్మె విరమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఐకేపీ వీవోఏల సంఘం నాయకులు డీఆర్డీవో పీడీ విజయలక్ష్మికి సమ్మె విరమిస్తున్నట్లు లేఖ అందజేశారు. వేతన సవరణకు ప్రభుత్వం హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నామని తెలిపారు. ఐడీకార్డుల జారీ, ఇన్సూరెన్స్‌, 5జీ ట్యాబుల అందజేత, జాబ్‌ చార్ట్‌, స్ర్తీనిధి ఇన్సెంటివ్‌, తదితర సమస్యలు పరిష్కరిం చాలని వారు కోరారు. సీఐటీయూ నాయ కులు బి. సురేష్‌, సాయన్న, జయశీల, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:42:33+05:30 IST