పార్టీకి ద్రోహంచేసిన వారికి బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2023-03-25T23:17:04+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి పార్టీకిద్రోహం చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.

పార్టీకి ద్రోహంచేసిన వారికి బుద్ధి చెప్పాలి

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 25: కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి పార్టీకిద్రోహం చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. హాత్‌సే హాత్‌ జోడో పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి పట్టణంలోని ప్రేమలాగార్డెన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై అక్రమ కేసులుపెట్టి సూరత్‌ కోర్టు శిక్ష వేసిందన్న సాకుతో రెండు సంవత్సరాలపాటు పార ్లమెంటు నుంచి బహిష్కరించడం మోదీ, అమిత్‌షాఅ కక్షసాధింపు చర్య అన్నారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయత్రతో దేశం లోని అన్నివర్గాల ప్రజల నుంచి పెరిగిన ఆదరణతో రానున్న ఎన్నికల్లో ప్రధాని అవుతాడన్న భయంతో బీజేపీ ప్రభుత్వం రాహుల్‌ గాంధీని పార్ల మెంటుకు రాకుండా అడ్డు కుంటోందన్నారు. రాహు ల్‌గాంధీని కాపాడుకునేం దుకు ప్రతికాంగ్రెస్‌ నాయకుడు నడుంబిగించా లన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌ ప్రజావ్యతిరేకవిధానాలను అవలంభిస్తున్నారని అన్నారు. వారి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలన్నారు. అంతకుముందు పార్లమెంట్‌ నుంచి రాహుల్‌గాంధీని బహిష్కరించినందుకు నిరసనగా పట్టణంలో బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని మోదీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరంపట్టణంలో కాగడాలప్రదర్శన చేపడుతూ అంబేద్కర్‌చౌక్‌లో కార్నర్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకివస్తే నిరుపేదలకు ఇండ్ల స్థలాలు,రూ.5లక్షలు ఇంటినిర్మాణం కోసం అందిస్తామన్నారు. రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తామన్నారు. నిరు ద్యోగుల కోసం ప్రతిఏడాది జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పిస్తామన్నారు. ధరణిలోని లోపాలను సవరించి అన్ని కాలమ్స్‌లను తిరిగి పొందు పరుస్తామన్నారు. హాత్‌సే హాత్‌ జోడో పాదయాత్ర జిల్లా కేంద్రం నుంచి మండలంలోని బూర్గుడ వరకు కొనసాగింది. బూర్గుడలో రాత్రి బసచేశారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, టీపీసీసీ కార్యదర్శి సరస్వతీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావు, నాయకులు గణేష్‌ రాథోడ్‌, మసాదే చరణ్‌, అనిల్‌గౌడ్‌, మహేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:17:04+05:30 IST