Share News

పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటికి మనుగడ

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:18 PM

జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియం త్రణకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర నేషనల్‌ కోర్‌ లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సందేశంతో రూపొందించిన బట్ట సంచులను అడిష నల్‌ కలెక్టర్‌ రాహుల్‌తో కలిసి ఆవిష్కరించారు.

పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటికి మనుగడ

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 18: జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియం త్రణకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర నేషనల్‌ కోర్‌ లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సందేశంతో రూపొందించిన బట్ట సంచులను అడిష నల్‌ కలెక్టర్‌ రాహుల్‌తో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భా గంగా ప్రజలందరూ సంచులను వాడాలన్నారు. ప్లాస్టిక్‌ భూతాన్ని తరమికొట్టేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బజారుకు వెల్లే ప్రతిసారి చేతి సంచులను వినియోగించా లన్నారు. మంచిర్యాల జిల్లాను సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఎంపిక చేసిన అన్ని యాజమాన్యాల గ్రీన్‌కోర్‌ పర్యా వరణ క్లబ్బులుగల పాఠశాలలకు సంచులు అంద జేస్తున్నామన్నారు. డీఈవో యాదయ్య, డీఆర్‌డీవో శేషాద్రి, సైన్స్‌ అధికారి మధుబాబు, జిల్లా పర్యావ రణ సమన్వయ కర్త యోగేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:19 PM