ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయం
ABN , First Publish Date - 2023-03-11T22:51:21+05:30 IST
స్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా మాదిగ సంగ్రామ యాత్ర చేపట్టామని - మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రేగుంట కేశవరావు అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం లో చేపడుతున్న మహా సంగ్రామ యాత్ర శనివారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుంది.
రెబ్బెన(ఆసిఫాబాద్‌రూరల్), మార్చి 11: ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా మాదిగ సంగ్రామ యాత్ర చేపట్టామని - మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రేగుంట కేశవరావు అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం లో చేపడుతున్న మహా సంగ్రామ యాత్ర శనివారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎస్సీ వర్గీకరణ చేపడుతామని హామీ ఇచ్చి విస్మ రించిందన్నారు. ఎస్పీవర్గీకరణ చేపట్టాలని ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సమ్మయ్య మాట్లాడుతూ నిరసన కార్యక్ర మానికి జిల్లాలోని ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎ స్ నాయకులు మల్లేష్, ప్రభాకర్, సురేష్, రమేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.