కక్ష సాధింపునకు పాల్పడుతున్న ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-06-11T22:49:47+05:30 IST

జిల్లాకు మంజూరైన మెడికల్‌ కళాశాలను హాజీపూర్‌ మండలంలో ఏర్పాటు చేసే లా కృషి చేసినందుకే ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయ న తనయుడు విజిత్‌రావులు తనపై కక్షగట్టారని జడ్పీటీసీ పుస్కూరి శిల్పశ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఐబీ గెస్ట్‌హౌజ్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.

కక్ష సాధింపునకు పాల్పడుతున్న ఎమ్మెల్యే

ఏసీసీ, జూన్‌ 11: జిల్లాకు మంజూరైన మెడికల్‌ కళాశాలను హాజీపూర్‌ మండలంలో ఏర్పాటు చేసే లా కృషి చేసినందుకే ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయ న తనయుడు విజిత్‌రావులు తనపై కక్షగట్టారని జడ్పీటీసీ పుస్కూరి శిల్పశ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఐబీ గెస్ట్‌హౌజ్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. నస్పూర్‌లో జరిగిన సీఎం కేసీఆర్‌ సభా వేదికపైకి ప్రోటోకాల్‌ ప్రకారం తనను అనుమ తించాల్సి ఉండగా కావాలనే ఎమ్మెల్యే, ఆయన తన యుడు ఆహ్వానితుల జాబితాలో తన పేరు లేకుం డా అవమానపరిచారన్నారు. లిస్టులో పేరు లేదనే కారణంగా పోలీసులు వేదికపైకి అనుమతిం చలేదన్నారు. ఎలాంటి హోదా లేని ఎమ్మెల్యే తన యుడు విజిత్‌రావును ఆహ్వానితుల జాబితాలో రెండో స్ధానంలో చేర్చారని ఇది ఎంత వరకు సబ బని ప్రశ్నించారు. గతంలో హాజీపూర్‌లో నిర్వహిం చిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి తనను ఆహ్వా నించకుండా అవమానపరిచారన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన స్థలంలో మెడికల్‌ కళాశాల ఏర్పా టైతే చుట్టు పక్కన భూములు ఎమ్మెల్యే బినామీల పేరున ఉన్నందున లబ్ధి పొందేవారని ఆరోపించారు. మంత్రి హరీష్‌రావును కలిసి గుడిపేటలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు లక్షెట్టిపేట, దండే పల్లి నాయకులు మద్దతు పలికినందునే కళాశాల మంజూరైందన్నారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యేను కోరినా పట్టించుకోకుండా మరోసారి సల హాలు ఇస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాడని కన్నీటి పర్యంతమయ్యారు.

ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా మెడికల్‌ కళాశాల గుడిపేటలో మంజూరు కావడాన్ని జీర్ణించుకోలేక రాజకీయంగా అణగదొక్కా లని చూస్తున్నాడన్నారు. గతంలో మంచిర్యాల జడ్పీ టీసీ రాచకొండ ఆశాలతను విజయోత్సవ సభలో వేదికపైకి అనుమతించక కించపర్చారన్నారు. ప్రజా ప్రతినిధులను అణగదొక్కడం, అవమానించడం మానుకోకుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ న్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే, ఆయన తనయుడు చేసే అరాచకాలపై నివేదిక అందజేస్తామని హెచ్చరించారు. నాయకు లు రాచకొండ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T22:49:47+05:30 IST