డంపింగ్‌యార్డు సమస్యను త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-06-07T22:39:30+05:30 IST

పట్టణంలో డంపింగ్‌యార్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారులకు సూచించారు.

డంపింగ్‌యార్డు సమస్యను త్వరగా పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, జూన్‌ 7 : పట్టణంలో డంపింగ్‌యార్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారులకు సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కమీషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కౌన్సిలర్లు సుజాత, రాజలింగు, రాములునాయక్‌, చంద్రశేఖర్‌, మధు, ఏఈ సందీప్‌, టీవో అశ్రిత్‌, నాయకులు శ్రీధర్‌, రమేష్‌, మంగమూర్తి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T22:39:30+05:30 IST