బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి

ABN , First Publish Date - 2023-02-06T22:41:45+05:30 IST

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్ర వరి 6: జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆసిఫా బాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న సూపర్‌ లగ్జరీ బస్సు పెద్దవాగు సమీపంలో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీబస్సు (టీఎస్‌20 జడ్‌ 0015) ఆసిఫాబాద్‌ నుంచి హైదరా బాద్‌కు బయలుదేరింది.

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి

- నడుస్తున్న బస్సులోంచి కిందికి దూకిన డ్రైవర్‌

- బోల్తాపడిన బస్సు.. ముగ్గురికి గాయాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్ర వరి 6: జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆసిఫా బాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న సూపర్‌ లగ్జరీ బస్సు పెద్దవాగు సమీపంలో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీబస్సు (టీఎస్‌20 జడ్‌ 0015) ఆసిఫాబాద్‌ నుంచి హైదరా బాద్‌కు బయలుదేరింది. పట్టణంలోని అటవీశాఖచెక్‌పోస్టు సమీపం లోని మూలమలుపు వద్ద డ్రైవర్‌ అడెసదయ్యకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావ డంతో కదులుతున్న బస్సులో నుంచి కిందికి దూకాడు. దీంతో పెద్దవాగు సమీపంలోని పెద్దగుంతలోకి బస్సు దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌సహ మరో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఒకరికి కాలుకు, మరొకరికి నడుముకు స్వల్పగాయాలయ్యాయి. కండక్టర్‌ శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ సదయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు ఆసిఫాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం మెరు గైనచికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. ఈమేరకు ఎస్సైరమేష్‌ సంఘ టన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T22:41:46+05:30 IST