Share News

గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ABN , Publish Date - Dec 14 , 2023 | 10:15 PM

జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్ర తలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉద యం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రరూపం దాల్చుతోంది.

గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

మంచిర్యాల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్ర తలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉద యం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రరూపం దాల్చుతోంది. ఉదయం 10 గంటల దాకా బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయం త్రం 5 దాటిందంటే చలి తీవ్రమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగ మంచు అలుముకుంటోంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 10 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవు తుండగా మంచిర్యాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తు తానికి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేయగా చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతున్నారు.

12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు....

జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోవడం ఆందోళన కలిగి స్తోంది. జన్నారం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండటంతో చలి తీవ్రం అవుతోంది. అటవీ ప్రాం తంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా పొగ మంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు చలిబారిన పడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులకు వెళ్లే సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మిడిల్‌ షిఫ్ట్‌ ముగించుకొని ఇళ్లకు వెళ్లేవారు, రాత్రి షిఫ్టు సమ యంలో విధులకు వెళ్లేటప్పుడు, తిరిగి ఉదయం వచ్చేటప్పుడు ఇబ్బం దులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం ఉదయం చలికి తట్టుకోలేక పోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే కూరగాయల విక్రేతలు, పాల వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు...

జిల్లాలో వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 7వ తేదీన 19.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 8న 16.9 డిగ్రీలు, 9న 16.2 డిగ్రీలు, 10న 14.4 డిగ్రీలు, 11న 13.2 డిగ్రీలు, 12న 12.6 డిగ్రీలు 13న 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పొగమంచుతో ఇబ్బందులు

కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా ముఖ్యంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొగ మంచు కారణంగా రోడ్లు కనబడక పోవడంతో లైట్ల వెలుతురులో వాహనాలను నడపాల్సి వస్తోంది. నాలుగు రోజులుగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతల కార ణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేయగా మిగతా ప్రాంతాల్లో ఎల్లో వార్నింగ్‌ ఇచ్చారు. వాతావరణం ఇలాగే ఉంటే రాబోయే నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకా శం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికా రులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:15 PM