Share News

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2023-12-09T22:17:09+05:30 IST

తెలంగాణలో మూడో శాస నసభ కొలువుతీరింది. గెలుపొందిన ఎమ్మెల్యేలతో శనివారం అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయించారు. జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

మంచిర్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మూడో శాస నసభ కొలువుతీరింది. గెలుపొందిన ఎమ్మెల్యేలతో శనివారం అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయించారు. జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎమ్మెల్యేల అధికారాలు అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని ఆంగ్లంలో చదివారు. గడ్డం వినోద్‌ గతంలో మంత్రిగా, వివేక్‌ పెద్దపల్లి ఎంపీగా పని చేశారు. మంచిర్యాల నుంచి ఎంపికైన ప్రేంసాగర్‌రావు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.

ఎమ్మెల్యేల బయోడేటా....

కొక్కిరాల ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల)

భార్య: కొక్కిరాల సురేఖ (డీసీసీ అధ్యక్షురాలు)

పుట్టిన తేది: 21-09-1960

సామాజిక వర్గం: వెలమ

విద్యాభ్యాసం: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ

రాజకీయ ప్రస్థానం...

2000-03 వరకు పీసీసీ కార్యదర్శిగా

2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీగా

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2018లో మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2023 సెప్టెంబర్‌ నుంచి టీపీసీసీ ఎలక్షన్స్‌ వ్యూహరచన కమిటీ చైర్మన్‌గా, ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా నియమింప బడ్డారు. నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2. గడ్డం వివేక్‌ (చెన్నూరు)

భార్య: సరోజ

పుట్టిన తేదీ: 30-11-1957

సామాజిక వర్గం: మాల

విద్యాభ్యాసం: వైద్య విద్య

రాజకీయ ప్రస్థానం....

2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా

2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి ఓటమి

2014-16 వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన వివేక్‌

2016-19 వరకు బీఆర్‌ఎస్‌లో చేరిక

2019-23 వరకు బీజేపీలో చేరిక

2023 నవంబరులో తిరిగి కాంగ్రెస్‌లో చేరిక, ఎమ్మెల్యేగా గెలుపు

3. గడ్డం వినోద్‌ (బెల్లంపల్లి)

భార్య: రమ

పుట్టిన తేదీ: 16-09-1956

విద్యాభ్యాసం: డిగ్రీ

రాజకీయ ప్రస్థానం...

2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నిక

2004-09 వరకు ఐదేళ్ళపాటు లేబర్‌ మినిష్టర్‌గా పదవీ బాధ్యతలు

1996-2004 వరకు హైద్రాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు

2004-10 వరకు హైద్రాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నియామకం

Updated Date - 2023-12-09T22:17:10+05:30 IST