విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-05-14T22:35:06+05:30 IST
విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలని డీఈవో పార్శి అశోక్ అన్నారు
కాగజ్‌నగర్ టౌన్, మే 14: విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలని డీఈవో పార్శి అశోక్ అన్నారు. స్థానిక డీఆర్సీ సెంటర్‌లో ఆదివారం పాలిసెట్, టీఎస్‌ఆర్‌జేసి విద్యార్థుల ఉచిత కోచింగ్ క్యాంపు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఆదిత్యరాం, శంకర్, శివ, సాయి, బాపు, సాయితేజలకు ఉచితంగా ఐఐటి కోచింగ్ ఇప్పించేందుకు ఆర్జీరావు ట్రస్టు ముందుకు వచ్చిందన్నారు. సంజీవిని ఐఐటి అకాడమీ నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ చాటిన సంజన, చౌదరి శంకర్, ఆదిత్యరాంను డీఈవో ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధూకర్, హెచ్‌ఎం చిలుకూరి సత్యనారాయణ, మామిడాల శ్రీశైలం, ఉపాధ్యాయులు తిరుపతయ్య, మోహన్, షబ్బీర్, శాంతికుమార్, కిషన్‌రావు, రాజ్‌కమలాకర్ రెడ్డి, తిరుపతి, వేణు తదితరులు పాల్గొన్నారు.