Share News

విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి

ABN , First Publish Date - 2023-12-05T22:41:00+05:30 IST

మండలంలోని అన్ని పాఠశా లల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం మండల కేం ద్రంలోని రైతువేదికలో యూడైస్‌ ప్లస్‌ పై శిక్షణ నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రతీ పాఠశాల భౌతిక వస తులు, విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఎంఈవో తిరుపతిరెడ్డి కోరారు.

విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి

కోటపల్లి, డిసెంబరు 5: మండలంలోని అన్ని పాఠశా లల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం మండల కేం ద్రంలోని రైతువేదికలో యూడైస్‌ ప్లస్‌ పై శిక్షణ నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రతీ పాఠశాల భౌతిక వస తులు, విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయుల వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఎంఈవో తిరుపతిరెడ్డి కోరారు. తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్ర మాల గురించి సమీక్ష జరిపా రు.

కాసిపేట: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంఈవో ప్రభాకర్‌ అన్నారు. మంగళవా రం మోడల్‌ స్కూల్‌లో యూడైస్‌ ప్లస్‌పై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాల ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వివరాల ఆధా రంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందించడం వీలవుతుందన్నారు. తప్పులు లేకుండా నమోదు చేయా లన్నారు. నోడల్‌ అధికారి లచ్చయ్య, కాంప్లెక్స్‌ ప్రధానో పాధ్యాయుడు సాంబమూర్తి, సుధాకర్‌ నాయక్‌, రమేష్‌రాథోడ్‌ ,ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T22:41:02+05:30 IST