బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయండి
ABN , First Publish Date - 2023-08-20T22:20:02+05:30 IST
తెలంగాణలో బీజేపీని మ రింతగా బలోపేతం చేయాలని ఓసా (మహారాష్ట్ర) ఎమ్మెల్యే అభిమన్యు దత్తాత్రేయ పవార్ అన్నారు. బీజేపీ అసెంబ్లీ ప్రవాస్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నస్పూర్‌లో ఆదివారం నిర్వహించిన కార్య కర్తల సమావేశంలో పాల్గొన్నారు.
నస్పూర్, ఆగస్టు 20: తెలంగాణలో బీజేపీని మ రింతగా బలోపేతం చేయాలని ఓసా (మహారాష్ట్ర) ఎమ్మెల్యే అభిమన్యు దత్తాత్రేయ పవార్ అన్నారు. బీజేపీ అసెంబ్లీ ప్రవాస్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నస్పూర్‌లో ఆదివారం నిర్వహించిన కార్య కర్తల సమావేశంలో పాల్గొన్నారు. సీసీసీలో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్ర, జిల్లా నాయకుల తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పవార్ మాట్లాడు తూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. బూత్ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, ప్రధాన కార్య దర్శి రజనీ జైన్, నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి, పానుగంటి మధు, ఆనంద్ కృష్ణ, ఆకుల ఆశోక్ వర్థన్, వాణి, గుండా ప్రభాకర్, మల్లికార్జున్, లక్ష్మన్, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్ పాల్గొన్నారు.
కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేయాలి
బెల్లంపల్లి: బీజేపీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేయాలని కర్ణాటక రాష్ట్రంలోని సులియా నియోజకవర్గ ఎమ్మెల్యే భగీ రధి మురుల్యా పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా ఆర్యవైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాటా ్లడారు. బీజేపీలో కింది స్థాయి నుంచి వచ్చిన కార్య కర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, నాయకులు కృష్ణదేవరాయలు, సంతోష్‌కుమార్, రాజులాల్ యాదవ్, గోవర్దన్, రజిని, అనిత, కేశవరెడ్డి, వెంకటకృష్ణ పాల్గొన్నారు.
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
చెన్నూరు: ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బెంగుళూరు ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రవాస్ యోజ నలో భాగంగా ఆదివారం పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో ప్రపంచంలోనే దేశం శక్తివంతంగా ఎదిగిందన్నారు. మోదీ అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త ముందుకు సాగాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పార్ల మెంట్ కోకన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, అసెం బ్లీ కన్వీనర్ అక్కల రమేష్, మాజీ ఎమ్మెల్యే సొత్కు సంజీవరావు, నాయకులు రాపర్తి వెంకటేశ్వర్లు, రఘునందన్, పోశం, దీక్షితులు, సుశీల్‌కుమార్, పత్తి శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు.