ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీసీతారామ కల్యాణం

ABN , First Publish Date - 2023-03-30T22:26:50+05:30 IST

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 30: శ్రీరామ నవమిని జిల్లాలోని ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. హోమాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్ని ఆలయాల్లో అన్నదానం నిర్వహించారు.

ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీసీతారామ కల్యాణం

- జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో సందడి

- హోమాలు, అన్నదాన కార్యక్రమాలు

- పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే కోనప్ప, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 30: శ్రీరామ నవమిని జిల్లాలోని ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. హోమాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్ని ఆలయాల్లో అన్నదానం నిర్వహించారు. జన్కా పూర్‌లోని కోదండ రామాలయంలో గురువారం సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితులు నిమ్మకంటి సంతోష్‌శర్మఆధ్వర్యంలో పండి తులు మహేష్‌శర్మ, విజయ్‌కుమార్‌, శీరిష్‌శర్మ, శ్రీధర్‌శర్మ, మహేష్‌, పూర్ణచందర్‌, ఆలయ అర్చ కులు వినాయక్‌శర్మ ఘనంగా నిర్వహించారు. పట్ట ణంలోని తుజాల్‌పూర్‌ మురళీగౌడ్‌ నివాసం నుంచి సీతారాముల ఉత్సవవిగ్రహాలను మహిళల నృత్యాలు, హన్‌మాన్‌ భక్తుల భజనల మధ్య శోభాయాత్రగా ఆలయం వరకు తీసుకు వచ్చారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి తన కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా ప్రధాన న్యాయ మూర్తి రవీంద్రశర్మ, ఎమ్మెల్యే అత్రం సక్కు, కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఎస్పీ కె సురేష్‌ కుమార్‌, ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, అదనపు కలెక్టర్‌ రాజేశం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లిఖార్జున్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ చిలూవేరి వెంకన్న, బీజేపీ నాయకులు బోనగిరి సతీష్‌బాబు, ఖాండ్రే విశాల్‌ తదితరులు స్వామివారి కల్యాణం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో పల్లకిసేవ, విష్ణు పారాయణం నిర్వహిం చారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని బాబాపూర్‌ లో హనుమాన్‌ భక్తులు శోభాయాత్ర నిర్వహిం చారు. ఈ సందర్భంగా కోదండ రామాలయం వద్ద పద్మశాలిసంఘం ఆధ్వర్యంలో మంచినీరు, బీజేపీ, వాసవీక్లబ్‌, బీసీ సంక్షేమం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.

బెజ్జూరు : బెజ్జూరు మండలకేంద్రంతోపాటు ఎల్కపల్లి, సలుగుపల్లి, మర్తిడి, అంబగట్టు, పాపన్న పేట, తదితర గ్రామాల్లో సీతారా ముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. వేకువజామున భక్తులంతా సీతారాముల ఉత్సవవిగ్రహాలతో శోభాయాత్ర నిర్వ హించారు.

చింతలమానేపల్లి: మండలంలోని బాబా సాగర్‌, చింతలమానేపల్లి, దిందా, డబ్బా తదితర గ్రామాల్లోని ఆంజనేయ ఆలయాలతోపాటు ఓంకార ఆశ్రమం, గీతామందిర్‌లో గురువారం వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నానయ్య, ఎస్సై విజయ్‌, స్వాములు నారా యణ నందగిరి స్వామి, అబేదా నందగిరిస్వామి, సదాశివ నంద గిరిస్వామి, భక్త బృందం, గ్రామస్థులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

కౌటాల: మండల కేంద్రంలోని కోదండ రామా లయం, తుమ్మిడిహెట్టి ప్రాణహితతీరాన కార్తీక్‌ మహారాజ్‌స్వామి ఆలయం, వార్దా నది కుల్తా(దీపం) ఆంజనేయస్వామి ఆలయంలో కల్యాణ మహోత్స వాన్ని నిర్వహించారు. ప్రాణహిత నదిలో సీతారా ముల ఉత్సవవిగ్రహాలకు మంగళస్నానం, తెప్పోత్స వం నిర్వహించారు. అనంతరం కల్యాణ కార్యక్ర మాన్ని పూర్తి చేశారు. రామాలయంలో ఆలయ ధర్మకర్త సత్యనారాయణ, అధ్యక్షుడు గట్టయ్యల ఆధ్వర్యంలో కార్తీక్‌మహారాజ్‌ ఆలయంలో ప్రకాష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో, కుల్తాలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దత్తు ఆధ్వ ర్యంలో కళ్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. కౌటాల సీఐ సాదిక్‌పాషా కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

పెంచికలపేట: మండలంలోని ఎల్కపల్లి రామా లయంలో, ఎల్లూరు ఆంజనేయస్వామి ఆలయంలో, చెడ్వాయి చీకటయ్య ఆలయంలో గురువారం వైభ వంగా సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సరిత, సర్పంచ్‌లు కావ్య, రాజన్న, నాయకులు రమేష్‌, నగేష్‌, భక్తులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలోని గోలేటి, నవవేగాంతో పాటు ఇతర గ్రామాల్లో సీతారాముల కల్యాణో త్సవం ఘనంగా నిర్వహిం చారు. గోలేటి టౌన్‌ షిప్‌లోని రామాలయంలో సీతారాము కల్యాణాన్ని భక్తజన సందోహం మధ్య ఘనంగా నిర్వ హించారు. సింగరేణి జీఎం దేవేందర్‌, గోలేటి సర్పంచ్‌ సుమలత, గంగాపూర్‌ సర్పంచ్‌ వినోద్‌ దంపతుల చేతుల మీదుగా కల్యాణోత్సవం నిర్వహించారు. కార్యక్ర మంలో ఎంపీపీ సౌందర్య, ఎంపీటీసీ సంధ్యారాణి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు అహల్యదేవి, సోమశేఖర్‌, నాయకులు నవీన్‌జైశ్వాల్‌, చిరంజీవిగౌడ్‌ పాల్గొన్నారు.

దహెగాం: మండలంలోని లగ్గాంలోని ఉమా చంద్రశేఖర ఆలయం, దహెగాం రామాలయం, అయిన, బీబ్రా, చిన్నరాస్పెల్లి, గిరివెల్లి, హత్తిని, కుంచె వెల్లి గ్రామాల్లోని ఆలయాల్లో గురువారం సీతారా ముల కల్యాణమహోత్సవం జరిగింది. ఎంపీపీ సులో చన, సంతోష్‌గౌడ్‌ దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా కోత్మీర్‌ గ్రామంలో సీతారాముల కల్యాణాన్ని సర్పంచ్‌ తరున్నం సుల్తానా, సోను ఘనంగా నిర్వహించారు.

వాంకిడి: మండలంలో బంబార, ఖిరిడిగ్రామా ల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణ మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ అజ య్‌కుమార్‌ దంపతులు బంబార ఆలయంలో సీతా రాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ సేవాసదన్‌ సంస్థ చైర్మన్‌ గాదే అవినాష్‌, ఆలయ కమిటీ సభ్యులు కోట్నక దేవరావు, వెంకట్‌రావు పాల్గొన్నారు.

కెరమెరి: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. మండలకేంద్రానికి చెందిన వ్యాపా రులు రామకృష్ణ, జగన్‌, ఎల్లప్ప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న వారికి ముస్లింలు జ్యూస్‌ పంపిణీ చేశారు. గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు. ఎస్సై వెంకటేష్‌ బందోబస్తు నిర్వహించారు.

సిర్పూర్‌(టి): మండలంలో గురువారం కల్యాణో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియెజకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్‌ బాబు, ఎస్సై దీకొండరమేష్‌ దంప తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి కల్యాణాన్ని జరిపిం చారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

జైనూరు: మండలకేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో గురువారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లోని హనుమాన్‌ మంది రాల్లో భక్తులు వేలాదిగా చేరుకుని రామ నామ జపం చేశారు. ఈ సందర్భంగా రాముని చిత్రపటానికి పూల మాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం సీతారామ కల్యాణం వైభవంగా నిర్వ హించారు. అదేవిధంగా శ్రీ రాముని చిత్రపటంతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ, శోభాయాత్ర వైభ వంగా కొనసాగింది. పెద్దఎతున సాముహిక సహ పంక్తి భోజనాలు చేశారు. జై శ్రీరాం అంటు భక్తుల నినాదం, కాషాయ జెండాలతో జైనూరు పట్టణం మారు మోగింది. కార్యక్రమంలో నిర్వాహకులు గుట్టె జనార్దన్‌, సతీష్‌ ముండె, కెంద్రేవెంకటి,ఫడ్‌ విజయ్‌, పొలిపెల్లి నరెందర్‌, ఓంట్రే పద్మాకర్‌, శేఖర్‌, భక్తులు పాల్గొన్నారు.

లింగాపూర్‌: లింగాపూర్‌ మండల కేంద్రతోపాటు గ్రామాల్లో వైభవంగా సీతారా ముల కల్యాణం నిర్వహించారు.

తిర్యాణి: మండలంలోని గంభీరావుపేట, తలండి, తిర్యాణి గ్రామపంచాయతీలో గురువారం సీతా రాముల కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం, మార్కెట్‌కమిటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రసాదవితరణ నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు మోతీరాం, శ్రీరాములు, శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): మండలకేంద్రంతోపాటు మారుమూల గ్రామాల్లో గురువారం శ్రీ రామనవమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు కల్యాణం నిర్వహిం చారు. అంతకుముందు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర నిర్వహిం చారు. మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్‌సిల్క్‌ రామమందిరంలో కౌన్సిలర్‌ బీస సమత నవీన్‌గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ తౌటం శ్రీనివాస్‌ దంపతులు కల్యాణం నిర్వహించారు. అలాగే పలు ఆలయాలతో పాటు మండలలోని గన్నారం, భట్టుపల్లి తదితర ఆలయాల్లో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. గన్నారంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, రుక్మిణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ రామాలయంలో పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే మండలంలోని గన్నారంలో కల్యాణం జరిపించారు. స్థానిక రైల్వే కాలనీలోని రామాలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కల్యాణోత్సవం తిలకించారు. పట్టణంలోని ఈఎస్‌ఐ కాలనీ, శాంతి కాలనీ, న్యూకాలనీ, ఓల్డ్‌కాలనీ, పంచముఖ ఆంజనేయ స్వామి, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లోనూ కన్నుల పండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఓల్డ్‌ కాలనీ, నౌగాంబస్తీ, ఈస్‌గాంతో పాటు పలు ఆల యాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ ప్రత్యేకపూజలు నిర్వహించారు. సర్‌సిల్క్‌, రైల్వే కాలనీ తదితర రామాలయాల్లో బీజేపీ నాయకుడు పాల్వాయి హరీశ్‌ బాబు, డాక్టర్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు రావి శ్రీనివాస్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సర్‌సిల్క్‌ రామాలయంలో కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కాగజ్‌నగర్‌ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌, ఆలయకమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T22:26:50+05:30 IST