వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-06-26T01:43:32+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభమై 25 రోజులు గ డుస్తున్న ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు వర్షాలు కుర వాలని మండలంలోని భరంపూర్‌, తలమడుగు, రుయ్యాడి, సకినాపూర్‌, సుంకిడి, కజ్జర్ల, తదితర గ్రామాల్లోని రైతులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గంగా జలాలతో జలాభిషేకం నిర్వహించారు.

వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
భరంపూర్‌లో దేవత విగ్రహాలకు జలాభిషేకం చేస్తున్న మహిళలు

తలమడుగు, జూన్‌ 25: వానాకాలం సీజన్‌ ప్రారంభమై 25 రోజులు గ డుస్తున్న ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు వర్షాలు కుర వాలని మండలంలోని భరంపూర్‌, తలమడుగు, రుయ్యాడి, సకినాపూర్‌, సుంకిడి, కజ్జర్ల, తదితర గ్రామాల్లోని రైతులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గంగా జలాలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆ వరణ దేవున్ని వేడుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా మండలంలోని భరంపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు గ్రామంలో గల శివాలయం, వేంకటేశ్వర స్వామి, పొచ్చమ్మ ఇతర గ్రామ దేవతలకు జలాభిషేకాలను నిర్వహించారు. అదే విధంగా తలమడుగు గ్రామానికి చెందిన రైతుల గ్రామ పొలిమెరలో గల భీమన్న ఆలయంలో జలాభిషేకం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2023-06-26T01:43:32+05:30 IST