పోలీసుస్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
ABN , First Publish Date - 2023-09-12T22:57:53+05:30 IST
మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.
పెంచికలపేట, సెప్టెంబరు 12: మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్ , లాకప్, మెన్‌బ్యారక్, టెక్నికల్‌రూం, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఎస్సై కొమురయ్యకు పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్, ఎస్సై కొమురయ్య ఉన్నారు.