సజావుగా ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2023-05-31T22:34:06+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు ఇకపైన సజావుగా సాగేలా చూస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్‌ అన్నారు

సజావుగా ధాన్యం కొనుగోళ్లు
రైతులతో మాట్లాడుతున్న అధికారులు

నెన్నెల, మే 31: ధాన్యం కొనుగోళ్లు ఇకపైన సజావుగా సాగేలా చూస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్‌ అన్నారు. నెన్నెల మండలం గొళ్లపల్లిలో ఐకేపీ ఽకొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలని రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న అక్కడి రైతులతో మాట్లాడారు. కాంటా సజావుగా సాగేలా చూస్తామని చెప్పారు. వెంట వెంటనే లారీలు పంపి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని హామీ ఇచ్చారు. సెంటర్‌ నిర్వాహనపై ఐకేపీ అధికారులు, సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సంబందిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెంటర్‌లో నిల్వ ఉన్న బస్తాలు, సేకరించిన ధాన్యం, ఇప్పటికి మిల్లులకు తరలించిన వివరాలను నిర్వహకులను అడిగి తెలసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. ఆయన వెంట తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ఏపీఎం విజయలక్ష్మి ఉన్నారు.

Updated Date - 2023-05-31T22:34:06+05:30 IST