ఆసిఫాబాద్ జిల్లాలో ఆరురోజులు 105కిలోమీటర్ల పాదయాత్ర
ABN , First Publish Date - 2023-03-19T21:57:41+05:30 IST
ఆసిఫాబాద్ రూరల్, మార్చి 19: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న హాత్‌సే హాత్‌జోడో యాత్ర జిల్లాలో ఆరురోజుల పాటు 105కిలోమీటర్లు కొనసాగు తుందని ఉమ్మడిజిల్లా మాజీఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు ప్రేంసాగర్‌రావు అన్నారు.

- మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు
- హాత్‌సే హాత్‌జోడో యాత్ర సన్నద్ధ సమావేశం
ఆసిఫాబాద్ రూరల్, మార్చి 19: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న హాత్‌సే హాత్‌జోడో యాత్ర జిల్లాలో ఆరురోజుల పాటు 105కిలోమీటర్లు కొనసాగు తుందని ఉమ్మడిజిల్లా మాజీఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల లాడ్జీలో జిల్లా కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన హాత్‌సే హాత్ జోడోయాత్ర కార్యకర్తల సన్నద్ధ సమావేశానికి పాదయాత్ర కోఆర్డి నేటర్ సయ్యద్ అంజముల్లా హుస్సేన్‌తో కలిసి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆరు రోజుల పాటు యాత్ర కొనసాగనుందన్నారు. ఈనెల 20న జైనూరు మండలంలో యాత్ర ప్రారంభమై 21వ తేదీ సాయంత్రం నాటికి కెరమెరి మండలానికి చేరుకుం టుందని,22,23తేదీల్లో ఉగాది పండుగను పురస్కరించు కుని యాత్రకు స్వల్పవిరామం ఉంటుందన్నారు. 24న తిరిగి ప్రారంభయయ్యే యాత్ర25న జిల్లా కేంద్రానికి చేరుకుని అంబేద్కర్‌చౌక్ వద్ద కార్నర్‌సమావేశం లేదా ప్రేమలా గార్డెన్‌లో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. 26, 27తేదీల్లో కూడా జిల్లాలో యాత్ర కొనసాగి 27న మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఆర్సీ ఇన్‌చార్జి రఘునాథ్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కోట్ల నాగేశ్వరరావు, పీసీసీ కార్యదర్శి సరస్వతీ, పీసీసీసభ్యుడు గణేష్‌రాథోడ్, గుండా శ్యాం, రవీందరెడ్డి, సోమయ్య, వసంతరావు, జీవన్ పాల్గొన్నారు.