లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు
ABN , First Publish Date - 2023-06-21T23:14:42+05:30 IST
బ్లాక్ మెయిల్ రాజకీయాలు, మహిళల లైంగిక వేధింపులతో బీఆర్‌ఎస్ నాయకులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
- రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్న శ్రేణులు
- పైరవీల పేరుతో లక్షల్లో అక్రమ వసూళ్లు
- జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు
మంచిర్యాల, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): బ్లాక్ మెయిల్ రాజకీయాలు, మహిళల లైంగిక వేధింపులతో బీఆర్‌ఎస్ నాయకులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి నియోజక వర్గాల్లో నాయకుల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. అధికార పార్టీ అండదండలు ఉండడంతో తామేం చేసినా చెల్లుతుందనే ఉద్దేశ్యంతో కిందిస్థాయి కార్యకర్తలు మొదలుకొని ముఖ్య నేతల వరకు రెచ్చిపోతున్నారు. నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న పలు శా ఖల అధికారులు వారికే మద్దతుగా నిలుస్తుండడం కొసమెరుపు. ముఖ్యం గా పోలీస్‌శాఖలో కొందరు అధికారులు, సిబ్బంది అధికార పార్టీ నాయ కులకు దాసోహం అవుతుండడం సామాన్య ప్రజలకు శాపంగా మారు తోంది. బీఆర్‌ఎస్ నాయకులపై బహిరంగంగా ఆరోపణలు వెల్లువెత్తినప్ప టికీ చర్యలు తీసుకోకపోవడమే దీనికి నిదర్శనం. గల్లీ లీడర్లు కూడా పోలీస్ స్టేషన్లలో తిష్ఠవేస్తూ పెద్ద మొత్తంలో పైరవీలు చేస్తున్నారు. నిత్యం ఎస్సైల టేబుల్ ముందు కూర్చుంటూ తమ పనులు చేసుకుంటు న్నారు. సామాన్యులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకోని కిందిస్థాయి అధికారులు..అధికార పార్టీ నాయకులు వస్తే మాత్రం కుర్చీలు వేసి మరీ పనులు చేసిపెడుతుండటం గమనార్హం.
ఇటీవల కాలంలో..
అధికార పార్టీ నాయకులపై ఇటీవల లైంగిక ఆరోపణలు అనేకం వినిస్తున్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ రెండు నెలలుగా తీవ్రమైన లైంగిక ఆరోపణలు చే స్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా శేజల్ వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. ఇక్కడ న్యాయం జరుగకపో వడంతో తన మకాం ఢిల్లీకి మార్చి నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఆమె నేరుగా ఫిర్యాదులు చేసింది. అంతటితో ఆగకుండా తనను ఎమ్మెల్యే అను చరులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇప్పుడు ఢిల్లీలోనే నిరసన దీక్షలు చేపడుతోంది. ఓ వైపు శేజల్ నిరసనలు కొనసాగుతుండగానే మరోవైపు జిల్లా కేంద్రం లోని బీర్‌ఆర్‌ఎస్ యువనేతపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పుమన్నాయి. మంచిర్యాల పట్టణ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ సాయం చేస్తానంటూ మాటలు కలిపి మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఓ వివాహిత ఈ నెల 20న మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్ నివాసం ఉంటున్న కాలనీలోనే తాను భర్తతో కలిసి జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది. తమ మధ్య గొడవను ప్రవీణ్ అనుకూలంగా మలుచుకొనేందుకు ఓ వైపు తన భర్తతో, మరోవైపు తనతో సన్నిహితంగా ఉంటున్నట్లు పేర్కొంది. తనకు పోలీసులు తెలుసునంటూ మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు అతడికి అనుకూలంగా ఉన్నారని వాపోయింది. దీనిని ఆసరాగా తీసుకొని తనకు అర్ధరాత్రి వరకు వాట్సాప్‌లో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తున్నాడని ఆరోపించింది. మరోసారి తనకు సంబంఽ దించిన వివాదంలో ప్రవీణ్ జోక్యం చేసుకోకుండా చూడాలని, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేయకుండా చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులను కోరింది. అలాగే నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన అధికార పార్టీ నాయకు డొకరు భార్యా భర్తల మధ్య జోక్యం చేసుకొని, మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కూడా లైంగిక ఆరోపణలు ఉన్నా యి. బాల్క సుమన్ తమను లైంగికంగా వాడుకుని మోసగించాడని జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు అక్కా, చెల్లెళ్లు ఆరోపించడం అప్పట్లో రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది.
సెటిల్ మెంట్లు, భూ దందాలు..
ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వివిధ అంశాల్లో తలదూరుస్తూ సెటిల్‌మెంట్లు, భూ దందాలు చేస్తున్నార నే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జాల పరంపరలో అక్కడి అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల హస్తమున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ నాయకులు వెనుక ఉండి బినామీల పేరిట భూ కబ్జాలకు పాల్పడుతు న్నట్లు ఆరోపణలున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనూ పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికావడం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తముందనే ప్రచారం జరుగుతోంది. చెన్నూరు నియోజక వర్గంలోని మందమర్రికి చెందిన ఓ నాయకుడు మండల పరిధిలో ఉన్న భూముల కబ్జాలకు పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. కాగా అధికార పార్టీ నాయకులు కొందరు భూ వివాదాల్లో జోక్యం చేసు కుంటూ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యో గాల్లో సైతం పైరవీలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలలో ఇటీవల ఔట్ సోర్సింగ్ నియామాల సందర్భంగా అధికార పార్టీ నాయకులు పెద్ద మొ త్తంలో పైరవీలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాల్లో నియ మితులైన వారిలో పదుల సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉండ డమే దీనికి నిదర్శనం. రాజకీయ అండదండలతో వివిధ శాఖల అధికారు లపై ఒత్తిడి తెస్తూ పైరవీలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. మంచిర్యాల నియో జకవర్గంలోని దండెపల్లిలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధి ఒకరు ప్రభుత్వ పథకాల్లో పైరవీలు చేసి అక్రమ మార్గంలో పనులు చక్కబె ట్టుకున్నాడు. అర్హత లేకపోయినా తనకు అనుకూలమైన వారికి వినికిడి విభాగంలో పింఛన్లు మంజూరు చేయించి లబ్ధి పొందాడు. రైతు బీమా పథకంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఏకంగా 10 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేశాడు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడం తో ఆయనపై పోలీసులు నామ మాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.