ఆసిఫాబాద్ జిల్లా సబ్‌జైలును సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
ABN , First Publish Date - 2023-03-18T22:06:16+05:30 IST
ఆసిఫాబాద్ రూరల్, మార్చి 18: జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును శనివారం సీనియర్ సివిల్‌జడ్జి, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి కె వెంకటేష్ పర్యవే క్షించారు. జైలులో వంటశాలను, ఆహార సామగ్రిని పరిశీలించారు.

ఆసిఫాబాద్ రూరల్, మార్చి 18: జిల్లా కేంద్రంలోని సబ్‌జైలును శనివారం సీనియర్ సివిల్‌జడ్జి, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి కె వెంకటేష్ పర్యవే క్షించారు. జైలులో వంటశాలను, ఆహార సామగ్రిని పరిశీలించారు. అనంతరం ఖైదీల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేర ప్రవృత్తని పెంచుకోకూడదని, పరివర్తన చెందాలని, నాగరిక సమాజంలో ఆటవీకంగా ప్రవర్తించరాదన్నారు. ఆయనవెంట బార్‌అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరహరి, న్యాయవాది విద్యాసాగర్ ఉన్నారు.