జపాన్‌ సైన్స్‌ ప్రదర్శనకు ఎంపిక

ABN , First Publish Date - 2023-06-02T22:39:43+05:30 IST

కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశా లలో పదో తరగతి చది విన జుమ్మిడి అంజన్న సైన్స్‌ ప్రదర్శనను జపాన్‌ దేశం ఆహ్వానించిందని వ్యాయామ ఉపాధ్యాయు డు రమేష్‌, ప్రధానోపాధ్యా యుడు నర్సింహాలు తెలి పారు.

జపాన్‌ సైన్స్‌ ప్రదర్శనకు ఎంపిక

కాసిపేట, జూన్‌ 2 : కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశా లలో పదో తరగతి చది విన జుమ్మిడి అంజన్న సైన్స్‌ ప్రదర్శనను జపాన్‌ దేశం ఆహ్వానించిందని వ్యాయామ ఉపాధ్యాయు డు రమేష్‌, ప్రధానోపాధ్యా యుడు నర్సింహాలు తెలి పారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గతంలో గైడ్‌ వేముల వాడ రమేష్‌ ఆధ్వర్యంలో అంజన్న ఫీడింగ్‌ చాంబర్‌ ప్రాజెక్టు ప్రదర్శించి జాతీయ స్ధాయిలో ఇన్‌స్పైర్‌ మనాక్‌ అవార్డులో నాలుగో స్ధానం పొందిందన్నారు. దీంతో జుమ్మిడి అంజన్నను గవర్నమెంట్‌ ఆఫ్‌ టకుర సైన్స్‌ హైస్కూల్‌ ప్రోగ్రాం ఆఫ్‌ జపాన్‌ వారు ఆహ్వానించారు. ఈ నెల 5న జరిగే ప్రోగ్రాంకు అంజన్న జపాన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఐటీడీఏ అధికారులు అంజన్నను అభినందించారు

Updated Date - 2023-06-02T22:39:43+05:30 IST