Share News

మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌స్టోర్‌

ABN , Publish Date - Dec 30 , 2023 | 10:12 PM

గోదావరి ఎఫ్‌పీవో రైస్‌స్టోర్‌లో నాణ్యమైన జై శ్రీరామ వడ్లను రైతుల నుంచి సేకరించి ఎక్కువ పాలిష్‌ లేకుండా తక్కువ ధరకు అందిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ పేర్కొన్నారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌స్టోర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 30: గోదావరి ఎఫ్‌పీవో రైస్‌స్టోర్‌లో నాణ్యమైన జై శ్రీరామ వడ్లను రైతుల నుంచి సేకరించి ఎక్కువ పాలిష్‌ లేకుండా తక్కువ ధరకు అందిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళ సం ఘాలు ఏర్పాటు చేసిన గోదావరి ఎఫ్‌పీవో రైస్‌ స్టోర్‌ను డీఆర్‌డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో నరేందర్‌లతో కలిసి ప్రారంభించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ క్వింటాల్‌కు రూ.5800 ధర నిర్ణయించామన్నారు. ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి అదనపు రవాణా చార్జీలతో సౌకర్యం కల్పిస్తామన్నారు. బియ్యం కావాల్సిన వారు 9652004886, 9121103856లో సంప్రదించాలన్నారు. కేంద్రం నిర్వహకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 10:12 PM