రైతులను ఆదుకునేందుకు కడెం నుంచి నీటి విడుదల
ABN , First Publish Date - 2023-03-02T23:09:52+05:30 IST
ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సదరమాట్ నుంచి కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిందని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌లు అన్నారు.
దండేపల్లి, మార్చి 2: ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సదరమాట్ నుంచి కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిందని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌లు అన్నారు. గురువారం దండేపల్లిలో కడెం ప్రఽధాన కాలువ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడెం ఎత్తిపోతల పథకంలో నెలకొన్న సమస్యల కు శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళారన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్లు లింగన్న, సురేష్, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ రవీందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, పట్టణ అధ్యక్షకార్యదర్శు సత్యం, లింగారెడ్డి, ఉప సర్పంచు భూమన్న, మాజీ ఎంపీపీ మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ రాజేందర్, మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ శంకర్‌రావు, పీఏసీఎస్ డైరెక్టర్ సంతోష్, పాల్గొన్నారు.