రంజాన్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

ABN , First Publish Date - 2023-03-18T22:09:55+05:30 IST

ఆసిఫాబాద్‌, మార్చి 18: ప్రజలందరూ కలిసి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఈనెల 23న ప్రారంభం కానున్న రంజాన్‌మాసం సందర్భంగా అదనపుకలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌ పాయ్‌, ఏఎస్పీ భీంరావుతో కలిసి ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు.

రంజాన్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

- కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ఆసిఫాబాద్‌, మార్చి 18: ప్రజలందరూ కలిసి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఈనెల 23న ప్రారంభం కానున్న రంజాన్‌మాసం సందర్భంగా అదనపుకలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌ పాయ్‌, ఏఎస్పీ భీంరావుతో కలిసి ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రంజాన్‌మాసం సందర్భంగా శాంతియుత, ప్రశాంత వాతావరణంలో ప్రజలందరు కలిసిపండుగ జరుపుకోవాలని తెలిపారు. మసీదుల వద్ద పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. పండ్ల షాపులు రాత్రి సమ యంలో ఉండే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాజే శ్వర్‌, మైనార్టీ సంక్షేమాధికారి షేక్‌మహమ్మద్‌, డీపీవో రమేష్‌, డీఆర్డీవో సురేందర్‌, సీఈవో రత్నమాల, పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, తహసీల్దార్‌లు, మసీద్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:09:55+05:30 IST