Share News

ప్రజల ఆశీర్వాదంతో ప్రేంసాగర్‌రావు గెలుపు

ABN , First Publish Date - 2023-12-05T22:38:06+05:30 IST

మంచిర్యాల నియోజకవ ర్గానికి మహార్ధశ పట్టనుందని కాంగ్రెస్‌ నాయకు లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రేంసాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు తూము ల నరేష్‌, బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ వేములపల్లి సంజీవ్‌లు మాట్లాడారు.

ప్రజల ఆశీర్వాదంతో ప్రేంసాగర్‌రావు గెలుపు

ఏసీసీ, డిసెంబరు 5: మంచిర్యాల నియోజకవ ర్గానికి మహార్ధశ పట్టనుందని కాంగ్రెస్‌ నాయకు లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రేంసాగర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు తూము ల నరేష్‌, బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ వేములపల్లి సంజీవ్‌లు మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రేంసాగర్‌రావు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేస్తారన్నారు. ఇన్నాళ్లు స్వచ్ఛందంగా ప్రజలకు చేసిన సేవలనుగాను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రేంసాగర్‌రావుకు కేబినెట్‌లో స్ధానం కల్పించి మంత్రి పదవి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేంసాగర్‌రావుకు మంచిర్యాల నియోజకవర్గం, జిల్లా, ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక విజన్‌ ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడ్డ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అగ్రస్ధానం లో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తారన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపా లిటీల్లో ప్రేంసాగర్‌రావుకు అత్యధిక మెజార్టీ కట్టబె ట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామ న్నారు. సమావేశంలో సత్యనారాయణ, కొండ చంద్రశేఖర్‌, పెంట రజిత, వసుంధర పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T22:38:07+05:30 IST