Share News

సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌

ABN , Publish Date - Dec 23 , 2023 | 10:00 PM

రాష్ట్రంలోని ప్రజల సమ స్యలు పరిష్కరించడం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్‌

జైపూర్‌, డిసెంబరు 23: రాష్ట్రంలోని ప్రజల సమ స్యలు పరిష్కరించడం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. కల్యాణలక్ష్మి లక్ష రూపా యల చెక్కుతోపాటు తులం బంగారం అందిస్తా మని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందన్నారు. ప్రజలు నేరుగా తన సెల్‌ నెంబర్‌కు వాట్సప్‌లో సమస్యలు పంపినా స్పందిస్తానని పేర్కొన్నారు. ఎస్టీపీపీలో స్ధానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సీఎంకు విన్నవించి సింగరేణి సీఎండీ ద్వారా జీవో తీసుకు వచ్చామన్నారు. ఎంపీపీ గోదారి రమాదేవి, జెడ్పీ టీసీ మేడి సునీత, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి, ఎంపీ డీవో సత్యనారాయణ, వ్యవసాయాధికారి మార్క్‌గ్లాడ్‌స్టన్‌, నాయకులుపాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఖజానాను అస్తవ్యస్తం చేసిందని, ప్రస్తుతం అప్పులు తప్ప ఏమి లేవని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. ఐటీఐ వద్ద 147 మంది లబ్ధిదారులకు కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దీనికి నిదర్శనం ప్రాజెక్టు కుంగిపోవడమేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలనను సాగిస్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీ హామీలను అమలు చేశా మని, మిగితా వాటిని కూడా అమలు చేస్తామ న్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలి పారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యేను సన్మానిం చారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఎంపీపీ మంగ, సర్పంచులు కొమురయ్య, తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ రవి పాల్గొన్నారు.

చెన్నూరు: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. సోమనపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేసి 15 రోజు ల్లో అన్ని గ్రామాల్లో నీటి సరఫరా చేయాలని అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజె క్టు ముంపు బాధితులను కాపాడాలని కోరగా ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి కరకట్ట నిర్మాణం విషయాలను తెలుసుకున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల్లో సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి ఉన్నారు.

క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

చెన్నూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకట స్వామి పరిశీలించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమ న్‌ క్యాంపు కార్యాలయంలో ఉం డగా అతను కొన్ని రోజుల క్రితం కార్యాలయాన్ని ఖాళీ చేశాడు. కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఫర్నీచర్‌, తదితర సదుపా యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

మూడు నెలల్లో అందుబాటులో ప్లైఓవర్‌ బ్రిడ్జి

రామకృష్ణాపూర్‌: క్యాతన్‌పల్లి రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి పనులు మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అం దుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆర్వోబీ పనులను పరిశీలించి మాట్లాడారు. ప్లైఓర్‌ బ్రిడ్జి విషయంలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్టి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని, మంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. పదేళ్ళు కావస్తుందని, ఇంకా ఎంత కాలం పనులు సాగుతాయని సంబంధిత అధికారులను ప్రశ్నిం చారు. కాంట్రాక్టరు సక్రమంగా పనులు నిర్వహిం చాలని, క్వాలిటీ తగ్గితే సహించేది లేదని ప్రస్తుత్తం వాడుతున్న దాని కంటే రామగుండం థర్మల్‌ పవర్‌ ప్లైయాష్‌ను వాడాలంటూ అధికారులకు సూచిం చారు. పనుల పురోగతిపై తనకు సమాచారం అందించాలని అఽధికారులకు తెలిపారు. పీసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘనాథ్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పల్లే రాజు, నాయకులు గోపతి రాజయ్య, యూకూబ్‌ ఆలీ, మల్లయ్య, ఎర్రబెల్లి రాజేష్‌, మాజీ వార్డు సభ్యులు సురేష్‌, కొమురయ్య, అధికారులు , కాంట్రాక్టర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 10:00 PM