ప్రభుత్వ భూమిలో పేదల గుడిసెలు
ABN , First Publish Date - 2023-04-30T23:04:08+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా స్పందిచడం లేదని ఆదివారం మండలంలోని భావురావుపేట గ్రామ శివారులోని 8 సర్వే నంబరులో దాదాపు 15 ఎకరాల భూమిలో వెయ్యి మందికి ప్తెగా నిరుపేదలు సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు
చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా స్పందిచడం లేదని ఆదివారం మండలంలోని భావురావుపేట గ్రామ శివారులోని 8 సర్వే నంబరులో దాదాపు 15 ఎకరాల భూమిలో వెయ్యి మందికి ప్తెగా నిరుపేదలు సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు రాజేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్యే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. నిరుపేదలు ఏళ్ల తరబడి అద్దె ఇళ్లల్లో ఉంటూ కనీస జీవనోపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉన్నారని గతంలో ఇదే భూమిని నిరుపేదలకు ఇస్తానని నాయకులు చెప్పారని అనంతరం మరిచారని అన్నారు. ఇప్పుడు అదే భూమిలో పేదలు అక్రమించుకోని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. నాయకులు, అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్కడికి చెరుకోని ప్రజలకు నచ్చజెప్పె ప్రయత్నం చేశారు. అదే సర్వే నంబరు భూమిలో కొంత మందికి అస్తెన్డ్ భూమి ఉందని అది వారి పేరు మీద పట్టా ఉందని డీటీ గోవింద్ అన్నారు. ఆ స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని తెలిపారు.
కేసు నమోదు..
కాగా పిల్లల మర్రి రాజబాపు అనే పట్టాదారు భూమిలో కొంతమంది అక్రమంగా చొరబడి డేరాలు వేసుకొని హద్దులు ఏర్పాటు చేసినందుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పది మంది పై కేస నమోదు చేశామని సీఐ వాసుదేవరావు తెలిపారు. మరి కొంతమంది కూడా ఈ కేసులో ఉన్నట్టుగా తెలిపారు.