దరఖాస్తుదారులను ఒప్పించేదెలా?

ABN , First Publish Date - 2023-04-03T23:20:45+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): భూముల క్రమబద్దీకరణ అంశం అధికారులకు తలనొప్పిగా మారింది. 2014లో ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నం58, 59లను జారీ చేసింది. అప్పట్లో తమ ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఆక్రమణదారులు కుప్పల తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హుల జాబితాలను తయారు చేసి నోటీసులిచ్చారు.

దరఖాస్తుదారులను ఒప్పించేదెలా?

-భూముల క్రమబద్ధీకరణకు అడ్డంకులు

-కటాఫ్‌ తేది పెంచినా కనిపించని స్పందన

-ప్రస్తుత విలువ నువసూలు చేయటమే కారణం

-ససేమిరా అంటున్న దరఖాస్తుదారులు

-స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా అదనపు కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

భూముల క్రమబద్దీకరణ అంశం అధికారులకు తలనొప్పిగా మారింది. 2014లో ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నం58, 59లను జారీ చేసింది. అప్పట్లో తమ ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఆక్రమణదారులు కుప్పల తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హుల జాబితాలను తయారు చేసి నోటీసులిచ్చారు. అయితే ఎనిమిదేళ్లుగా దరఖాస్తుదారులు నిర్ణీత వాయిదాల్లో రెగ్యూలరైజేషన్‌ ఫీజులు చెల్లించకపోవటంతో ఈ ప్రక్రియకు ప్రతిష్టంభన ఏర్పడింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో మరోసారి ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ కోసం 2014వరకు ఉన్న కటాఫ్‌ తేదీని 2020జూన్‌ 2వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే పెనాల్టీ రుసుము కింద ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు మొత్తాన్ని 2014రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా కాకుండా 2022జూన్‌ 2వ తేదీనాటికి ఉన్న విలువ ఆధారంగా వసూలు చేయాలని నిర్ణయించటం ప్రస్తుతం చిక్కులు తెచ్చి పెడుతోంది. ప్రస్తుత రుసుముల ప్రకారం భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తుదారులు ఆసక్తి చూపకపోవటంతో వారికి నచ్చజెప్పేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి వాయిదా పద్ధతిలో నిర్ణీత ఫీజులు చెల్లించాలంటూ కోరుతున్నా స్పందించటం లేదని అంటున్నారు. ముఖ్యంగా 2022విలువ ఆధారంగా నిర్ణయించిన ఫీజులు మార్కెట్‌ విలువకు ఇంచుమించు అటుఇటుగా ఉండటం వల్లే రెగ్యులరైజేషన్‌ చేయించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావటం లేదని చెబుతున్నారు. వాస్తవానికి 2014లో ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం 125చదరపు గజాలవరకు స్థలాన్ని జీవో ఎంఎస్‌58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించగా, జీవో59 క్రింద 125నుంచి 250చదరపు గజాల వరకు 25శాతం పెనాల్టీతో క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలాగే 500చదరపు గజాల వరకు 50శాతం ఫీజు, 500చదరపు గజాలు 1000చదరపు గజాల లోపు 100శాతం పెనాల్టీతో భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఆసిఫాబాద్‌ వంటి వెనుకబడిన జిల్లాలో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మార్కెట్‌ విలువకు సమానంగా ఉండటం వల్ల భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఆసక్తి చూపటం లేదు. ఫలితంగా జిల్లాలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే వందశాతం ఫీజు చెల్లించి భూములను క్రమబద్ధీకరించుకున్నపరిస్థితి కొనసాగుతోంది.

జిల్లాలో ప్రస్తుత పరిస్థితి..

ఆసిఫాబాద్‌ జిల్లాలో జీవో నం.58,59 కింద వందలాది దరఖాస్తులు రాగా ఇందులో వడపోతల తర్వాత 54దరఖాస్తులు మాత్రమే 59జీవోకు అనుగుణంగా క్రమబద్ధీకరించేందుకు అర్హత ఉన్నట్టుగా తేల్చారు. తద్వారా మొత్తం రూ.1.54కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు గాను మూడు వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు ఇవ్వగా ఇందులో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే పూర్తిస్థాయిలో చెల్లింపులు జరిపి భూములను క్రమబద్ధీకరించుకున్నారు. ఐదుగురు సింగిల్‌ వాయిదా చెల్లించి ఆ తర్వాత చెల్లింపులు చేయలేదు. అలాగే మరో ఇద్దరు రెండు వాయిదాలు కట్టారు. 51దరఖాస్తులకు సంబంధించి అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీచేసినా స్పందించటం లేదు. 2014లో చదరపు గజానికి రూ.600ఫీజుగా నిర్ణయించగా ప్రస్తుతం 2022ధరల ప్రకారం రూ.2100వసూలు చేయాలని డిమాండు నోటీసులివ్వటమే ఈ ప్రతిష్టంభనకు కారణమని చెబుతున్నారు. స్వయంగా జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) రాజేశం దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు.

Updated Date - 2023-04-03T23:31:16+05:30 IST