రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2023-02-09T01:16:04+05:30 IST

రిమ్స్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
రిమ్స్‌లో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 8: రిమ్స్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. బుధవారం రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, రిమ్స్‌ ఆసుపత్రులను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీలో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన అనుభవం కలిగిన వైద్య బృందం అందుబాటులో ఉందని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని రోగులకు రిమ్స్‌ ఆసుపత్రులకు వైద్య చికిత్సల కోసం రావడం జరుగుతుందని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్యం అం దిస్తూ ఒక ఆసెట్‌ లాగా జిల్లాలో కలిగి ఉండటం అదృష్టంగా భావించవచ్చని అన్నారు. ఇప్పటికే పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నామని రానున్న కాలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో పూర్తిఆస్థయి వైద్య సేవలు అందించడానికి వైద్య బృందం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తూ అవసరమైన సౌకర్యాలు అందించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మారుమూల ఆదిలాబాద్‌ జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు వారి సేవలను అందించడం అదృష్టమని, ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తూ జిల్లా ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు తమ సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం రిమ్స్‌ ఆసుపత్రిలో పలు విభాగాలను, ఐసీయూ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ డా.జైసింగ్‌ రాథోడ్‌, డా.తిప్పా స్వామి, డా.ఇద్రీస్‌ అక్బని, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-09T01:16:06+05:30 IST