పంచాయతీలకు అవార్డులు రావడం అభినందనీయం

ABN , First Publish Date - 2023-03-25T23:15:31+05:30 IST

దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ పురస్కార్‌-2023లో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీలకు అవార్డులు రావడం అభినందనీ యమని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు అన్నారు.

పంచాయతీలకు అవార్డులు రావడం అభినందనీయం

ఆసిఫాబాద్‌, మార్చి 25: దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ పురస్కార్‌-2023లో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీలకు అవార్డులు రావడం అభినందనీ యమని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాజేశం, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలిసి జిల్లాస్థాయి ఉత్తమపంచాయతీ అవార్డులను అంద జేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 9 మండ లాల్లో 13గ్రామ పంచాయతీలకు 27అవార్డులు అందజేశామని తెలిపారు. అనంతరం ఆయాగ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శు లకు బహుమతులు ప్రదానం చేసి ప్రశంసాపత్రాలు అందజేశారు. జడ్పీచైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు సాధించుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిగా మిగిలిన గ్రామపంచాయతీలు పనిచేయా లని తెలిపారు.

సీపీఆర్‌ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు

సీపీఆర్‌ చేసి గుండెపోటుకు గురైన వారి ప్రాణాలు కాపాడవచ్చని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ అనంతరం చాలామంది గుండెనొప్పితో మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలపారు. సీపీఆర్‌ చేయడం ప్రతివ్యక్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళాసంఘాల బలోపేతానికి చర్యలు

జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో రూ.25లక్షల వ్య యంతో ఏర్పాటు చేసి న నాన్‌ఓన్‌ బ్యాగుల తయారీ యంత్రం, రూ.2లక్షలతో ఏర్పా టు చేసిన చిరుధా న్యాల పిండిగిర్ని యంత్రాలను జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ మహిళాసంఘాలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. వడ్డీ లేని రుణాలలో భాగంగా రూ.3.65 కోట్ల చెక్కును జిల్లా సమాఖ్యకు అందించామని తెలిపారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి మాట్లాడుతూ మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో సినిమా హాలు, షాపులు, బ్యాగులు తయారు చేసే యంత్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్త్రీనిధి అవార్డులు అందజే శారు. ఆయా కార్యక్రమంలో డీపీవో రమేష్‌, ఎంపీ పీలు విమలాబాయి, విశ్వనాథ్‌, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, కోవ అరుణ, సంతోష్‌, డీఆర్డీవో సురేం దర్‌, ఏపీడీ శ్రీనివాస్‌రెడ్డి, ఎల్‌డీఎం హనుమంతరావు, ఏపీఎంలు, సీసీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

వేసవి సమీపస్తున్నందున ప్రజల సంక్షేమం దృష్ట్యా అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సంక్షేమచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హేమంత్‌ సహదే వరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వేసవిలో చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై జిల్లాశాఖల అధికారు లతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జన సంచారం అధి కంగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అంబలి పంపిణీకి చర్యలు తీసుకో వాలని, నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ప్రతి రోజు తాగునీటిని అందించాలని, నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. నీటి సరఫరా అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, బస్సు షెల్టరు లేని ప్రాంతాలను గుర్తించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ లలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించా లన్నారు.

Updated Date - 2023-03-25T23:15:31+05:30 IST