చెన్నూర్‌పై నజర్
ABN , First Publish Date - 2023-05-26T22:45:31+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు గెలుపొందే అభ్యర్థుల కోసం పావులు కదుపుతున్నాయి.

పార్టీ ఎదైనా టికెట్ దొరికితే చాలు
కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులకు అవకాశం
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు గెలుపొందే అభ్యర్థుల కోసం పావులు కదుపుతున్నాయి.
మంచిర్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): చెన్నూర్ నియోజక వర్గంలో టికెట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంటుంది. పార్టీ ఎదైనా టికెట్ దొరికితే చాలు బరిలో నిలిచేందుకు ఆశావహులు వేచి చూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. వీటిలో చెన్నూర్, బెల్లంపల్లి నియోజక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. బెల్లంపల్లిలో గత రెండు దఫాలుగా నేతకాని సామాజిక వర్గానికి చెందిన దుర్గం చిన్నయ్య విజయం సాధించారు. చెన్నూరులో మొదటి నుంచి మాల, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలు పొందుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా నేతకాని కుల స్తుడైన బోర్లకుంట వెంకటేష్‌నేతకు టికెట్ కేటాయించింది. కాగా బీఆర్‌ఎస్ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన బాల్క సుమన్ బరిలోకి దిగి విజయం సాధించారు.
రాయ్‌పూర్ తీర్మానం మేరకు..
2024 సాధారణ ఎన్నికల్లో చెన్నూర్ నియోజక వర్గం నుంచి విపరీతమైన పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. రాయ్‌పూర్ తీర్మానం మేరకు ఒకవేళ సామాజిక వర్గం దామాషాన టికెట్లు కేటాయిస్తే చెన్నూరు రసవత్తర రాజకీయాలకు నెలవు కానుంది. నియోజక వర్గంలో మొత్తం లక్షా 77వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 45వేల పై చిలుకు మంది నేతకాని ఓటర్లు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు 15వేలు, మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మరో ఏడెనిమిది వేల వరకు ఉంటారు. మిగతా వారిలో వెనుకబడ్డ కులస్తులు, ఇతరులు ఉంటారు. మొత్తం ఓటర్లలో ఇంచు మించు సగం ఓటర్లు నేతకాని సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పార్టీలు టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కాగా బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తిరిగి రంగంలో ఉండాలనే ఆలోచనతో ఉన్నందున ఇక్కడి నుంచి ఇతరులు టికెట్ అడిగే సాహసం చేయడం లేదు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరించి నందున పార్టీ అధిష్ఠానం బాల్క సుమన్ సేవలను చెన్నూరు నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పొందాలని భావిస్తే మాత్రం ఇక్కడ ఆశావహులు అధిక సంఖ్యలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే కాంగ్రెస్ నేతకానీలకు టికెట్ ఇచ్చినందున మరోసారి కూడా ఆ అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తే ఊహించని రీతిలో పోటీ నెలకొంటుంది.
అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా..
చెన్నూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా తమ పార్టీ తరుపున బరిలో నిలిపేందుకు కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపు తున్నాయి. కాంగ్రెస్ నుంచి నూకల రమేశ్ పేరు వినిపిస్తుండగా, మరికొం దరు నేతలు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్థానం నుంచి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వా లనే లక్ష్యంతో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆ దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఆహ్వా నించారు. ఓదెలు కాంగ్రెస్‌లో చేరగానే గెలుపు ఖాయమైందనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఓదెలు తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరడంతో అధిష్ఠానం ఇక్కడ మళ్లీ ధృష్టిసారిం చింది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వర్గం చెన్నూరులో సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో అధిష్ఠానం పలువురి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో చెన్నూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి బోడ జనార్దన్, నేతకాని సామాజిక వర్గానికి చెందిన దుర్గం అశోక్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. దుర్గం అశోక్ తన ట్రస్టు ద్వారా నియోజక వర్గం లో వివిధ సామాజిక సేవలు చేపడుతున్నారు. రేవంత్ వర్గం అయనను సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా అశోక్‌ను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని దుర్గం అశోక్ ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. కాగా పాత మంచిర్యాలకు చెందిన నేతకాని సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ కూడా టికెట్ వేటలో ఉన్నారు. బాల్క సుమన్ స్థానం ఖాళీ అయితే ఆ అవకాశం తనను వరిస్తుందన్న నమ్మకంతో తన తండ్రి దుర్గం పోశం చారిటబుల్ ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు చేపడుతు న్నారు. అలాగే ఈ స్థానం నుంచి టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి బి సంజయ్ కూడా బరిలో నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని రామకృ ష్ణాపూర్‌కు చెందిన ఆయన సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువ అవుతున్నారు.