ఇంటింటికి మోదీ సంక్షేమ పథకాలు వివరించాలి

ABN , First Publish Date - 2023-06-11T22:54:38+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకా లను ఇంటింటికి తీసుకువెళ్లేందుకే మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్ర మం చేపట్టామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జీ పల్లె గంగారెడ్డి అన్నారు.

ఇంటింటికి మోదీ సంక్షేమ పథకాలు వివరించాలి

ఏసీసీ, జూన్‌ 11: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకా లను ఇంటింటికి తీసుకువెళ్లేందుకే మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్ర మం చేపట్టామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జీ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 9 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి పార్టీపై ప్రజాదరణ పెంచేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మంచిర్యాల పర్యటనకు వచ్చి జిల్లా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీశారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. హాజీపూర్‌ మండలం పడ్తన్‌పల్లిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని ప్రచారం చేసి రైతులను మోసం చేశారన్నారు. అనంతరం పార్టీ సీనియర్‌ నాయకులను సన్మానించారు. నాయకులు మల్లికార్జున్‌, పురుషోత్తం, ప్రభాకర్‌, పోశం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T22:54:38+05:30 IST