లిఫ్టు ఇరిగేషన్లను పట్టించుకోని ఎమ్మెల్యే: పాల్వాయి హరీష్‌బాబు
ABN , First Publish Date - 2023-05-25T22:07:57+05:30 IST
సిర్పూర్(టి), మే 25: వార్ధా నది మీద ఉన్న లిఫ్టు ఇరిగేషన్లను మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యే ఎందుకని బీజేపీ నియో జకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పల్లెపల్లెకూ పాల్వాయి- గడపగ డపకూ బీజేపీ యాత్రలో భాగం గా గురువారం మండలంలోని మాకిడి, జక్కాపూర్, హుడ్కిలి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిం చారు.

సిర్పూర్(టి), మే 25: వార్ధా నది మీద ఉన్న లిఫ్టు ఇరిగేషన్లను మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యే ఎందుకని బీజేపీ నియో జకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. పల్లెపల్లెకూ పాల్వాయి- గడపగ డపకూ బీజేపీ యాత్రలో భాగం గా గురువారం మండలంలోని మాకిడి, జక్కాపూర్, హుడ్కిలి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్ధా నది మీద ఉన్న లోనవెల్లి, హుడ్కిలి, సాండ్‌గాం ఎత్తిపోతల పథకాల మరమ్మ తులకు నోచుకోక రైతులు సాగునీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే కోనప్ప ఏ నాడు ఎత్తిపోతల పథకంపైన దృష్టి సారించలేదన్నారు. ఫలితంగా నియోజక వర్గంలో 17లిఫ్టు ఇరిగేషన్ పథకాల కింద ఉన్న 30వేల ఎకరాలు బీడుగా మారిన పరిస్థితి దాపురించింద న్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, ఆనద్, శ్యాంరావు, మహేష్, భగవాన్, సాయి, శంకర్, సుభాష్, వికాస్, ప్రవీణ్, ప్రఫూల్ తదితరులు పాల్గొన్నారు.