రైతుల దీక్ష విరమింపజేసిన మంత్రి ఐకే రెడ్డి

ABN , First Publish Date - 2023-08-23T01:31:13+05:30 IST

జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని గత ఐదు రోజులుగా రిలే దీక్ష చేస్తుండగా మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వారికి నిమ్మరసం అందించి నిరాహారదీక్ష విరమింపజేశారు

రైతుల దీక్ష విరమింపజేసిన మంత్రి ఐకే రెడ్డి
రైతుతో దీక్ష విరమింపజేస్తున్న మంత్రి ఐకే రెడ్డి

రాజకీయ లబ్ధికోసమే మహేశ్వర్‌రెడ్డి దీక్షలు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 22 : జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని గత ఐదు రోజులుగా రిలే దీక్ష చేస్తుండగా మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. వారికి నిమ్మరసం అందించి నిరాహారదీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మాస్టర్‌ప్లాన్‌పై ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని కేవలం ఇది డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ అన్నారు. ఇంకా ఫైనల్‌ కాలేదని ప్రజలు గ్రహించాలన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసు కుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వబోమన్నారు. తమది రైతుసంక్షేమ ప్రభుత్వమని వారికి వ్యతి రేక నిర్ణయాలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు మాస్టర్‌ ప్లాన్‌పై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. తమ దీక్ష రాజకీయాలకు అతీ తమని స్పష్టం చేస్తూ మంత్రి హామీ మేరకు దీక్ష విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.

రాజకీయ లబ్ధికోసం మహేశ్వర్‌రెడ్డి దీక్ష

రాజకీయ లబ్ధికోసమే బీజేపీ నాయకుడు మహేశ్వర్‌రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ అడ్డుపెట్టుకొని ఆమరణ దీక్ష చేశారని ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరో పించారు. ఆయన చేసిన దీక్ష ప్రజలు నమ్మరన్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారన్నారు. తాను 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నట్లు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని సవాల్‌ విసిరారు. నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేదంటే ఆరోపణలు చేసిన వారు ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. నిజాయితీగా పని చేస్తున్నందునే ప్రజలు మూడు దశాబ్దాల నుంచి తనను ఆదరిసు ్తన్నారన్నారు.

ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతినిచ్చింది కేంద్రమే

జిల్లాలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అనుమతి చ్చిందని అన్నారు. అక్కడ 35 ఎకరాల భూములను మహేశ్వర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, రమణారెడ్డిలు కొనుగోలు చేసి కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకున్నారన్నారు. దిలావర్‌పూర్‌, గుండంపల్లి గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇథనాల్‌ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. పరిశ్రమను తాము కూడా అడ్డు కొని రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భూము లు రైతులు అమ్మవద్దని కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, తదితర నాయకులు మంత్రి వెంట ఉన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

మామడ : గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వే స్తుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని కొరిటికల్‌ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మంత్రికి మరోసారి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఖరారు కావడంతో గ్రామస్థులు బోరిగాం ఎక్స్‌రోడ్‌ నుంచి కొరిటికల్‌ వరకు బైక్‌ర్యాలీ నిర్వహిస్తూ, బాణాసంచాలు కాలు స్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పి. భోజ వ్వ బాపురెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ కిషోర్‌, మాజీ డీసీసీబీ అధ్యక్షులు రాంకిషన్‌ రెడ్డి, డీసీసీబీ వైస్‌ ప్రెసిడెంట్‌ రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు.

లక్ష్మణచాంద : మండలంలోని బోరిగాం గ్రామంలో నిర్మిస్తున్న 20 వేల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అంతకుముందు త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చినందున మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి నాయకులు అల్లోల సురేందర్‌ రెడ్డి, కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, తహసీల్దార్‌ శ్రీలత తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2023-08-23T01:31:13+05:30 IST