Share News

క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:29 PM

క్రీడలతో మాన సిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు తెలిపారు. పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్కూల్‌ లెవల్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలు ఆదివారం ముగిశా యి.

క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం

మందమర్రిటౌన్‌, డిసెంబరు 17: క్రీడలతో మాన సిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు తెలిపారు. పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్కూల్‌ లెవల్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలు ఆదివారం ముగిశా యి. బహుమతుల ప్రధానోత్సవానికి జెడ్పీ చైర్‌ప ర్సన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లా డుతూ క్రీడలతో మంచి భవిష్యత్‌ ఉంటుందని, స్పోర్ట్స్‌ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధిం చవచ్చని తెలిపారు. జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యు లు క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. క్రీడాకారులు గెలుపోటములను ఒకే విధంగా తీసు కుని క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల అభి వృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతకు ముందు ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బాలుర విభాగంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జైపూర్‌ ప్రథమ, సిర్పూరు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జట్టు ద్వితీయ స్థానంలో నిలి చింది. బాలికల విభాగంలో ఆసిఫాబాద్‌ ట్రైబల్‌ మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ జట్టు విజేతగా నిలువగా, మంచిర్యాల జెడ్పీహెచ్‌ఎస్‌ జట్లు ద్వితీయ స్ధానంలో నిలిచింది. మూడో స్ధానంలో ఆదిలాబాద్‌ టీఎస్‌ మోడల్‌ స్కూల్‌ జట్టు విజయం సాధించింది. హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, గోనే శ్యాంసుందర్‌రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమే ష్‌, సభ్యులు రాం వెంకటేశ్వర్లు, సకినాల శంకర్‌, బి. శంకర్‌, జాతీయస్ధాయి రెఫరీలు అరవింద్‌, రాజలిం గు, కళ్యాణ్‌, రాజశేఖర్‌, శృతి, వర్ష పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:29 PM