Share News

‘మహాలక్ష్మి’ పథకం మహిళలకు గొప్పవరం

ABN , First Publish Date - 2023-12-10T22:12:05+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం గొప్ప వరంలాందని, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల ఎమ్మె ల్యేగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆదివారం హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి వచ్చారు.

‘మహాలక్ష్మి’ పథకం మహిళలకు గొప్పవరం

దండేపల్లి, డిసెంబరు 10: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం గొప్ప వరంలాందని, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల ఎమ్మె ల్యేగా గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆదివారం హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి వచ్చారు. జిల్లా సరిహద్దు గూడెం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్రేన్‌ సాయంతో గజమాల వేసి ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గార్యంటీ పథకంలో భాగంగా అధికారం చేపట్టిన రెండు రోజుల్లో రెండు పథకాలను అమలు చేసిన ఘన త కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు. అత్యధిక శాతం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుండగా, మహాలక్ష్మి పథకం ద్వారా మహి ళలపై భారం తగ్గుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆనందంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తు న్నారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు అండగా ఉంటోం దని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అందే వైద్యసాయం పరిమితిని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు రూ.10లక్షలకు పెంచిందన్నారు. గూడెం నుంచి కరీంనగర్‌ చౌరస్తా వరకు అడుగడుగున ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు మహిళలు మంగళహరతులతో ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2023-12-10T22:12:06+05:30 IST