Share News

Kumaram Bheem Asifabad: యాసంగి ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - Dec 28 , 2023 | 10:39 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 28: జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికలను వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు. వానకాలం సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా లోని చెరువులు, కుంటలు, బావులు, ప్రాజెక్టులు, బోరుబావులు నీటి తో కళకళలాడుతున్నాయి. భూగర్భజలాలు సమృద్ధిగా అందు బాటులో ఉన్నాయి.

Kumaram Bheem Asifabad: యాసంగి ప్రణాళిక ఖరారు

- జిల్లాలో 45,757ఎకరాల్లో సాగు అంచనా

- ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ

ఆసిఫాబాద్‌, డిసెంబరు 28: జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికలను వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు. వానకాలం సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా లోని చెరువులు, కుంటలు, బావులు, ప్రాజెక్టులు, బోరుబావులు నీటి తో కళకళలాడుతున్నాయి. భూగర్భజలాలు సమృద్ధిగా అందు బాటులో ఉన్నాయి. దీంతో యాసంగి సాగుకు అన్ని రకాల పంటలు వేసుకోవడానికి అనుకూలమని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో వివిధ పంటల సాగు అంచనా ఎరువులు, విత్తనాల అవసరాలు ఎంత, ఎలా సిద్ధం చేయాలో కార్యాచరణను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది.

జిల్లాలో 45,757 ఎకరాల్లో సాగు అంచనా

జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 45,757ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు. జిల్లాలో వరి పంట 18.067 ఎకరాలు, పెసర 2148ఎకరాలు, జొన్న 10,212 ఎకరాలు, మొక్కజొన్న 2322 ఎకరాలు, శెనగ 7881 ఎకరాలు, గోదుమలు 1224ఎకరాలు, వెరుశెనగ 298ఎకరాలు, ఇతర పంటలు 3605ఎకరాల్లో సాగు అవు తుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు.

విత్తనాలు, ఎరువులు అవసరం

జిల్లాలో యాసంగి సీజన్‌లో మొత్తం 5224 క్వింటాళ్ల విత్తనాలు, 11361 మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ అధి కారులు అంచనా వేశారు. ఇందులో వరి విత్తనాలు 1806 క్వింటాళ్లు, పెసర 86, జొన్న 306, మొక్కజొన్న 93, శెనగ2364, గోదుమలు 306, వేరుశెనగ 178క్వింటాళ్లు, ఇతర పంటలకు 85 క్వింటాళ్ళ విత్తనాలు అవసరముంటుందని అంచనా వేశారు. దీంతోపాటు యూరియా 4161 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 2589 మెట్రిక్‌ టన్నులు, పోటాష్‌ 1468మెట్రిక్‌ టన్నులు, సూపర్‌ ఫాస్పేట్‌ 1151మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1992 మెట్రిక్‌టన్నులు అవసరముం టుందని అంచనా వేశారు. ఈ మేరకు విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులోకి ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

సమృద్ధిగా నీటి నిలువలు

జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమో దైంది. జిల్లా వ్యాప్తంగా 10522 మిట్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 10990మిట్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లాలోని 15 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో నీటి నిలు వలు సమృద్ధిగా దీంతో ఈ యాసంగి వరిసాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. వరితో పాటు జొన్న, శెనగ ఇతర అంతర పంటలను సాగు చేయనున్నారు.

యాసంగి ప్రణాళికలను సిద్ధం చేశాం:

- శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

జిల్లాలో యాసంగి ప్రణాళికలను సిద్ధం చేశాం. ఈ సీజన్‌లో జిల్లాలో 45,757 ఎకరాలలో సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేశాం. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను అందిసు ్తన్నాం. ఆయామండలాల వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి సలహాలు, సూచనలను తీసుకోవాలి.

Updated Date - Dec 28 , 2023 | 10:39 PM