Kumaram Bheem Asifabad: మహిళలు ఆపదలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి
ABN , First Publish Date - 2023-11-10T22:22:31+05:30 IST
ఆసిఫాబాద్, నవంబరు 10: మహిళలు ఆపదసమయంలో ధైర్యం గా ఉండి సమయస్ఫూర్తితో వ్యవ హరించాలని జిల్లా మహిళా సాధి కారత కేంద్రం సమన్వయకర్త బి శారద అన్నారు. శుక్రవారం కలెక్ట రేట్‌లో పనిప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న హింసా చట్టం 2013పై ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు అవగాహన కల్పించారు.
- జిల్లామహిళాసాధికారత కేంద్రం సమన్వయకర్త బి శారద
ఆసిఫాబాద్, నవంబరు 10: మహిళలు ఆపదసమయంలో ధైర్యం గా ఉండి సమయస్ఫూర్తితో వ్యవ హరించాలని జిల్లా మహిళా సాధి కారత కేంద్రం సమన్వయకర్త బి శారద అన్నారు. శుక్రవారం కలెక్ట రేట్‌లో పనిప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న హింసా చట్టం 2013పై ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాలలో హింసకు గురవుతున్న మహిళలు ఇంటర్నల్ కంప్లైన్ కమిటీ, లోకల్ కంప్లైన్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్క రిస్తామని తెలిపారు. ప్రమాదకరమైన, అవసర మైన సందర్భాలలో తెలివితో కొత్త ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యలను ఎలా ఎదుర్కో వాలో అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం ఎలా అందించాలో బై స్టాండర్డ్ ఇంటర్ వెన్టన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది రవి, సాగర్, డీపీఎంలు యాదగిరి, అన్నాజీ, మిత్తు, భూమక్క, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.