Share News

Kumaram Bheem Asifabad: ప్రజా తీర్పును గౌరవిస్తాం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2023-12-04T22:28:56+05:30 IST

కాగజ్‌నగర్‌, డిసెంబరు 4: ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కలిసికట్టుగా తమ పార్టీపై ప్రజల్లో తప్పుడు ఆరోపణలు చేసినట్టు తెలిపారు.

Kumaram Bheem Asifabad:  ప్రజా తీర్పును గౌరవిస్తాం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

కాగజ్‌నగర్‌, డిసెంబరు 4: ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కలిసికట్టుగా తమ పార్టీపై ప్రజల్లో తప్పుడు ఆరోపణలు చేసినట్టు తెలిపారు. అలాగే పలు బూత్‌లో అధికార పార్టీ నాయకులు ఆగడాలు చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో తాము న్యాయం చేయాలని పోరాటం చేస్తే తమపైన్నే దాడికి దిగినా కూడా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి తమను ఓడించినట్టు పేర్కొన్నారు. సిర్పూరులో ఉంటానన్నారు. ఎక్కడికి పోయేది లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు. బీఎస్పీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే వివిధ అంశాలపై సిర్పూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి దిశా నిర్దేశం చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సిడాం గణపతి, అర్షద్‌ హుస్సేన్‌, లెండుగురే శ్యాంరావు, నక్క మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-04T22:28:57+05:30 IST