Share News

Kumaram Bheem Asifabad: ఇది ప్రజల విజయం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ABN , First Publish Date - 2023-12-08T22:41:50+05:30 IST

జైనూర్‌/సిర్పూర్‌ (యు), డిసెంబరు 8: ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎమ్మె ల్యేగా గెలు పొందిన తర్వాత తొలి సారిగా ఆమె శుక్రవారం జైనూరు, సిర్పూర్‌(యు), మండలాలను సందర్శించారు.

Kumaram Bheem Asifabad: ఇది ప్రజల విజయం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

జైనూర్‌/సిర్పూర్‌ (యు), డిసెంబరు 8: ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎమ్మె ల్యేగా గెలు పొందిన తర్వాత తొలి సారిగా ఆమె శుక్రవారం జైనూరు, సిర్పూర్‌(యు), మండలాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా విజయం సాధించడంపై జైనూరులో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆమెమాట్లాడారు. తనకుఓట్లువేసి భారీమెజార్టీతో గెలిపించిన అందరికీ రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గం సమస్యలు త్వరితగతిన పరిష్కరించేం దుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీమార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఆత్రం భగ్వం త్‌రావ్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు సయద్‌ అబుతాలిబ్‌, సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనకయాదవ్‌రావ్‌ పాల్గొన్నారు.

అభిమాని దీక్షను విరమింపజేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

లింగాపూర్‌: లింగాపూర్‌ మండలం ఏల్లాపట్టార్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గోండుగుడా గ్రామానికి చెందిన సలాం మారు కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా గెలవాలని ఎన్నికల ముందునుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్షి శుక్రవారం వారి గ్రామానికి వచ్చి నిరాహార దీక్ష చేస్తున్న సలాం మారుకి పాలు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు అధైర్యపడొద్దన్నారు. ప్రభుత్వం మనది రాకున్నా మనకు వచ్చే నిధులు మనకు వస్తాయ న్నారు. కొట్లాడైన జిల్లా అభివృద్ధి కోసం అధిక నిధులు తీసుకొస్తాన న్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి గెలిచాక తొలిసారిగా మండ లానికి వచ్చినందున కార్యకర్తలు డప్పుచప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. మండలకేంద్రానికి చెందినకార్యకర్త జాటోత్‌ రాహూల్‌ కుమారుడు ఇటీవల చని పోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారివెంట జైనూర్‌, సిర్పూర్‌(యు), నాయకులు కనకయాదవ్‌రావు, ఆత్రంభగవంతరావు, లాలా, అనిల్‌ ఉన్నారు.

Updated Date - 2023-12-08T22:41:51+05:30 IST