Kumaram Bheem Asifabad: ఈసుగాం శివమల్లన్న ఆలయంలో షష్టి బోనాలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:51 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 17: కాగజ్‌నగర్ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయం లో ఆదివారం షష్టి బోనాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. వరిపంట చేతికందిన నేపథ్యంలో భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి
కాగజ్‌నగర్, డిసెంబరు 17: కాగజ్‌నగర్ మండలం ఈసుగాం శివమల్లన్న ఆలయం లో ఆదివారం షష్టి బోనాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. వరిపంట చేతికందిన నేపథ్యంలో భక్తులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి బోనం వండి శివాలయంలో ప్రసాదం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా నలుమూలలనుంచి భక్తులు ఈసుగాం ఆలయానికి ఉదయం పూటనే చేరుకున్నారు. భక్తులు రావటంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.