కుమరం భీం ఆసిఫాబాద్‌: బంగారు తెలంగాణకు బాటలు

ABN , First Publish Date - 2023-06-02T22:15:43+05:30 IST

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నా రని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్సీ సుంకరిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కుమరం భీం ఆసిఫాబాద్‌: బంగారు తెలంగాణకు బాటలు

- ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ సుంకరి రాజు

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నా రని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్సీ సుంకరిరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీ రుల స్థూపంవద్ద గౌరవవందనం స్వీకరించి ప్రజాప్రతినిధు లు, అధికారులతో కలిసి నివాళులర్పించి కలెక్టరేట్‌కు చేరుకు న్నారు. స్వాతంత్య్ర పోరాటయోదులకు నివాళులర్పించి, జాతీ యజెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికఅభివృద్ధిలో జీడీపీ వృద్ధిరేటు 10.2శాతం ఉండగా జీఏస్డీపీ వృద్ధిరేటు 13.2శాతంతో దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొని వాటిని అభివృద్ది చేయడంలో సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో జరిగిన ప్రగ తిని వివరించి అయా శాఖలలో జరిగిన అభివృద్ధిని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, అద నపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, పద్మఅవార్డుగ్రహీత కనకరాజు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ కనకయాదవరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ అజయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఆలీబీన్‌ఆహ్మద్‌, డీఆర్వోరాజేశ్వర్‌, డీపీఆర్వో కృష్ణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాస్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T22:15:43+05:30 IST