Kumaram Bheem Asifabad: సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ABN , First Publish Date - 2023-08-02T22:05:23+05:30 IST
ఆసిఫాబాద్, ఆగస్టు 2: ఎడతెరిపిలేకుండా కురు స్తున్న వర్షాలకారణంగా జిల్లాలో వరద పరిస్థితు లేర్పడితే సహాయక చర్యలకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 2: ఎడతెరిపిలేకుండా కురు స్తున్న వర్షాలకారణంగా జిల్లాలో వరద పరిస్థితు లేర్పడితే సహాయక చర్యలకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, దాసరి వేణు, జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వరదల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీ వోలు, నీటి పారుదల శాఖ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆదివాసీ గిరిజన గ్రామాల పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతనెలలో ముందస్తుగా తీసు కున్న రక్షణ చర్యలతో వరదల వల్ల ఎలాంటి ఇబ్బం దులు, ప్రాణ నష్టంలేకుండా ప్రజలను కాపాడు కోగలిగామన్నారు. ఇకముం దు భారీ వర్షాలు కురిసి నప్పుడు సంభవించే వరద లపై ఆదివాసీ,గిరిజన గ్రామా ల ప్రజల్లో అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఉధృతంగా ప్రవహి స్తున్న వాగులు, వంతెల వద్ద పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌శాఖల సమన్వయంతో బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సహా యార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 6304686505 ఏర్పాటు చేశామని అత్యవసర సేవలకోసం ప్రజలు సంప్రదించవచ్చ న్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించాలన్నారు. ఆదివాసీ గ్రామాల్లో ప్రజల సహాయార్థం ప్రజాప్రతినిధుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.