Share News

Kumaram Bheem Asifabad: ప్రజావాణి సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:18 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 18: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధితశాఖల అధికా రుల సమన్వయంతో త్వరగా పరిష్కరిచేందుకు చర్యలు చేపడుతామని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు.

Kumaram Bheem Asifabad: ప్రజావాణి సమస్యల పరిష్కారానికి చర్యలు

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 18: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధితశాఖల అధికా రుల సమన్వయంతో త్వరగా పరిష్కరిచేందుకు చర్యలు చేపడుతామని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో డీఆర్వో సురేష్‌ తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా కేంద్రానికి చెందిన జూపాక సుజాత తన భర్త మరణించాడని, ఒక చిన్న కూతురు ఉందని ఉపాధి కల్పించాలని వినతిపత్రం అందిం చారు. సిర్పూర్‌లోని న్యూకాలనీవాసులు తమ కాలనీకి విద్యుత్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బెజ్జూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని సర్వేనెం.43లో తనకు సంబంధించిన మూడెకరాల విస్తీరణంగల భూమికి పట్టా పాసు బుక్కులు మంజూరు చేయాలని ఇ సుమలత కోరారు. తన వారసత్వ భూమికి సంబం ధించిన పట్టాపాసుబుక్కు మంజూరు చేయాలని కాగజ్‌ నగర్‌ మండలం భుట్టపల్లికి చెందిన పోతురాజుల ప్రమీల దరఖాస్తు చేసుకున్నారు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌లో పాఠశాల, ఆసుపత్రి, చర్చ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న వైన్‌షాపును వేరే చోటికి మార్చాలని కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌ మండలం రవీచంద్ర కాలనీకి చెందిన గైని లక్ష్మి తాను డిగ్రీ చదువుకు న్నానని ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని నూతన కలెక్టరేట్‌లో ఏదైనా పని ఇప్పించాలని కోరింది.

Updated Date - Dec 18 , 2023 | 10:18 PM