Kumaram Bheem Asifabad: సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయండి: ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ABN , First Publish Date - 2023-11-21T22:32:19+05:30 IST
బెజ్జూరు, నవంబరు 21: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి తనకు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగ ళవారం మండలంలోని ముంజంపల్లి, బారెగూడ, పోతెపల్లి, కాటేపల్లి, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బెజ్జూరు, నవంబరు 21: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి తనకు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగ ళవారం మండలంలోని ముంజంపల్లి, బారెగూడ, పోతెపల్లి, కాటేపల్లి, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నియోజకవర్గ ప్రజలు మూడు సార్లు గెలిపించారని, దీంతో అన్ని గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. నాల్గోసారి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.
చింతలమానేపల్లి: మళ్లీఆశీర్వదించండి నియో జకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. మండలంలోని దిందా గ్రామంలో ఎన్నికల ప్రచారంచేపట్టారు. రాష్ట్ర ప్రభు త్వం చేపుతున్న సంక్షేమపథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంద న్నారు. బీఆర్ ఎస్‌కు ఓటువేసి తనను మరోసారి ఎమ్మె ల్యేగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కౌటాల: మరోసారి ఎమ్మెల్యేగా తనకు పట్టం కట్టాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కౌటాల మండలంలోని ముత్తంపేటలో ఆయన మాట్లాడారు. ముందుగా కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం మాట్లాడుతూ ముత్తంపేటలో 90 శాతం సీసీరోడ్లు పూర్తి చేశామన్నారు. చిన్నాచితక రోడ్లు ఏమైనా ఉంటే రాబోయే రోజుల్లో పూర్తి చేస్తా మన్నారు. ముత్యంపేట గ్రామంలోనే కల్యాణ లక్ష్మి కింద రూ.1.30కోట్ల లబ్దిచేకూరిందన్నారు. కార్యక్ర మంలో సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సురేఖ, వసంత్, అంజన్న పాల్గొన్నారు.
అధిక మెజార్టీతో గెల్పించాలి: కోనేరు రమాదేవి
కాగజ్‌నగర్: ఈసారి జరిగే ఎన్నికల్లో సిర్పూరు ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్పను అధిక మెజార్టీతో గెల్పించాలని కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌లో 13,14వార్డు ల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీ ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరుకోనప్పను అత్యధికమెజార్టీతో గెల్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ సద్దాం హుస్సేన్, కౌన్సిలర్లు ఫరీన్ సుల్తానా, నసీం భాను, మాజీ మున్సిపల్‌చైర్మన్ కావేటి సాయిలీల, కావేటి విజయ్‌కుమార్, కీర్తి రేఖ, తదితరులు పాల్గొన్నారు.