Kumaram Bheem Asifabad: సీఎం సభ ఏర్పాట్ల పరిశీలించిన నాయకులు
ABN , First Publish Date - 2023-11-06T22:57:17+05:30 IST
ఆసిఫాబాద్, నవంబరు 6: సీఎం కేసీఆర్ ఈనెల 8వ తేదీన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభకు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సోమవారం పరిశీలించారు.
ఆసిఫాబాద్, నవంబరు 6: సీఎం కేసీఆర్ ఈనెల 8వ తేదీన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభకు వస్తున్న నేపథ్యంలో గ్రౌండ్, సభాప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. వారివెంట జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర నాయకురాలు మర్సుకోల సరస్వతి, ఎంపీపీ అరిగెల మల్లికా ర్జున్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, నాయకులు అహ్మద్, తదితరులు ఉన్నారు.