Share News

Kumaram Bheem Asifabad: ఆ ఊర్లో ఓటేస్తే జరిమానే!

ABN , First Publish Date - 2023-11-19T22:11:12+05:30 IST

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌): అది ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉండే ఓ కుగ్రామం. చుట్టూ వాగులే ఉన్న ఆ గ్రామానికి వానొచ్చిందంటే బయటకు రాలేని దుస్థితిని శతాబ్ధాలుగా అనుభవిస్తున్నారు. ఊరికి వంతెన కావాలన్న కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. సరిగ్గా 17ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వంతెన మంజూరు చేసినా అది నేటికీ ఆచరణలోకి రాలేదు.

Kumaram Bheem Asifabad:  ఆ ఊర్లో ఓటేస్తే జరిమానే!

-ఎన్నికలు బహిష్కరిస్తూ గుండి గ్రామస్థులు తీర్మానం

-వంతెన పూర్తికాక పోవటమే కారణం

-ఓట్లు అడిగేందుకు నేతలు రావొద్దంటూ ఫ్లెక్సీలు

-గ్రామంలో 1779 ఓటర్లు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

అది ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉండే ఓ కుగ్రామం. చుట్టూ వాగులే ఉన్న ఆ గ్రామానికి వానొచ్చిందంటే బయటకు రాలేని దుస్థితిని శతాబ్ధాలుగా అనుభవిస్తున్నారు. ఊరికి వంతెన కావాలన్న కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. సరిగ్గా 17ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వంతెన మంజూరు చేసినా అది నేటికీ ఆచరణలోకి రాలేదు. దాంతో గ్రామస్థులంతా ఏకమై ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని తీర్మాణించారు. ఎన్నికల్లో ఓటువేస్తే గ్రామస్థులు జరిమానా చెల్లిం చేలా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా పరోక్షంగా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజెప్పుతున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా గుండి గ్రామానికి సంబంధించి 2006లో బ్రిడ్జి నిర్మాణం కోసం అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి తాటిపత్రి జీవన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ.2.50కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ వంతెన పనులు నిధుల లేమి కారణంతో పూర్తి కాలేదు. అయితే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతి ఎన్నికల సందర్భంగా హడావుడి చేయటం ఆ తర్వాత మరిచి పోవటం పరిపాటిగా మారింది.

వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే పెద్దవాగును దాటలేక ఇప్పటికే చాలా మంది ప్రమాదాల బారినపడ్డారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ప్రతి వర్షాకాలంలో ఈ వంతెనను పూర్తి చేయాలంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా పట్టించుకునే వారేలేరు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓట్లకోసం గ్రామం చుట్టూ ప్రచా రం చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు వంతెన పూర్తి చేసే దాక ఓట్లు వేయబోమని, ఓట్లు అడిగేందుకు రావద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ పరిణామాల్లో అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్పష్టమైన హామీఇస్తే గాని తాము ఎన్నికల ప్రక్రి యలో పాల్గొనమని తేల్చిచెప్పిన గ్రామ స్థులు నేతలు ఎవరూ రావద్దంటూ ఊరి పొలిమేరలో ఫ్లెక్సీలు కట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుండిగ్రామంలో మొత్తం 5వేల జనాభాఉండగా 1779మంది ఓటర్లు ఉన్నారు. వంతెన పనులు ప్రారంభించి 17సంవత్సరాలు పూర్తి కాగా ఈ వ్యవధిలో ముగ్గురు కాంట్రాక్టర్లు పనులు చేపట్టి వదిలేశారని గ్రామస్థులు అంటున్నా రు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటం వల్లే పనులు కొనసాగటం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇదే విషయమై అధికారులను సంప్రదిస్తే సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

Updated Date - 2023-11-19T22:11:14+05:30 IST