Share News

Kumaram Bheem Asifabad: అతిథి భవనానికి ఆదరణ కరువు

ABN , First Publish Date - 2023-12-10T22:07:45+05:30 IST

రెబ్బెన, డిసెంబరు 10: నిజాం కాలం నాటి నుంచి ప్రముఖులు, అతిఽథులకు విడిది సౌకర్యం కల్పించిన చోటది. మండల కేంద్రంలో ఆ పురాతన కట్టడం విషయంలో పాలకులు, అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది.

Kumaram Bheem Asifabad:  అతిథి భవనానికి ఆదరణ కరువు

-నిజాం కాలం నాటి విశ్రాంతి భవనం

-మరమ్మతు లేక శిథిలావస్థకు చేరిన వైనం

రెబ్బెన, డిసెంబరు 10: నిజాం కాలం నాటి నుంచి ప్రముఖులు, అతిఽథులకు విడిది సౌకర్యం కల్పించిన చోటది. మండల కేంద్రంలో ఆ పురాతన కట్టడం విషయంలో పాలకులు, అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు విడిది చేసేందుకు వసతి సౌకర్యం లేకుండా పోయింది. నిజాం కాలంలో ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంగా ఉండగా పరిపాలన కార్యక్రమాలను నిజాం ప్రభువు హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షించేందుకు అధికారులు రైలుమార్గం ద్వారా ఆసిఫాబాద్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌(రెబ్బెన మండల కేంద్రం ఉన్న రైల్వే స్టేషన్‌)లో దిగి వెళ్లేవారు. అయితే దూరప్రాంతం నుంచి ప్రయాణాలు సాగించటంతో అలసిపోయిన అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రెబ్బెనలో విశ్రాంతి భవనాన్ని 1932లో నిర్మించారు. అప్పటినుంచి ఎంతో మంది అందులో సేద తీరేవారు. నిజాం కాలం ముగిశాక ఈ భవనం బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖ తీసుకుంది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి, ఇతర పనుల నిమిత్తం మండలానికి వచ్చిన వారు ఈ భవనంలోనే సేద తీరేవారు. తమ కార్యక్రమాలకు హాజరయ్యేవారు.

శిథిలావస్థకు చేరి..

నిజాం కాలం నాటి విశ్రాంతి భవనాన్ని పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనంలో రెండు పడకల గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే కాలక్రమేణా భవనం పాతదై పోగా మరమ్మతులు చేపట్టక పోవటంతో శిథిలావస్థకు చేరింది. మండు వేసవిలోనూ ఎలాంటి ఏసీలు లేకున్నా చల్లగా ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ భవనం కళావిహీనంగా మారింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెచ్చేట్టు చూడాలని అంతా కోరుతున్నారు.

మరమ్మతులు చేపట్టాలి...

-మోడం చిరంజీవి గౌడ్‌, రెబ్బెన

విశ్రాంతి భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. గతంలో ఏ కార్యక్రమం జరిగిన కూడా ముఖ్య అతి థులుఈ భవనంలో సేద తీరి కార్యక్రమాలకు హాజరయ్యే వారు. అధికారులు వెంటనే స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి.

అఽధికారులు స్పందించాలి..

-బొమ్మినేని శ్రీధర్‌, రెబ్బెన

విశ్రాంతి భవనానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చేట్టు చూడాలి. వారంలో అధికారులు, నాయకులు వివిధ రకాల ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వస్తుంటారు. సేద తీర్చుకునేందుకు భవనం అవసరం ఉంటుంది. అధికారులు తక్షణమే స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చేందుకు చూడాలి.

Updated Date - 2023-12-10T22:07:47+05:30 IST